గ్రాఫిక్స్ కోసమే 50 కోట్లు ఖర్చుపెడుతున్నారట

0
11
prabhas new movie spending 50 crs for graphics

తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రంలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండనున్నాయట దాంతో గ్రాఫిక్స్ కోసం ఏకంగా 50 కోట్లు ఖర్చపెట్టనున్నట్లు తెలుస్తోంది. అగ్ర నిర్మాత అశ్వనీదత్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ప్రభాస్ మార్కెట్ అనూహ్యంగా పెరగడంతో 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ధైర్యం చేస్తున్నాడు.

సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రంలో వైఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండటంతో ఇప్పుడే అంతర్జాతీయ సంస్థతో డీల్ కుదుర్చుకునే పనిలో పడ్డారట దర్శకులు నాగ్ అశ్విన్. ఇందుకోసం 50 కోట్లు వెచ్చించడానికి సిద్దమయ్యారట దర్శక నిర్మాతలు. ఇక చిత్రంలో హీరోయిన్ గా దీపికా పదుకోన్ ని ఎంపిక చేసే పనిలో పడ్డారట. బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 చిత్రం మాదిరిగా ఉండనుందట సినిమా

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి