ట్రైనర్ కు రేంజ్ రోవర్ కారుని గిఫ్ట్ గా ఇచ్చిన ప్రభాస్

0
32
prabhas gift to his trainer
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ఫిట్ నెస్ ట్రైనర్ కు భారీ గిఫ్ట్ ఇచ్చాడు. ఏకంగా 40 లక్షలకు పైగా విలువైన రేంజ్ రోవర్ కారుని గిఫ్ట్ గా ఇచ్చి అందరూ షాక్ అయ్యేలా చేసాడు ప్రభాస్. తన ఫిట్ నెస్ కోసం కొంత కాలంగా చాలా కష్టపడుతున్నాడు ప్రభాస్. అయితే తాను ఇంత ఫిట్ గా ఉండటానికి కారణం అయిన జిమ్ ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డికి ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడట ప్రభాస్. అనుకున్నదే తడవుగా ఏం ఇస్తే బాగుంటుందో అని బాగా అలోచించి తన రేంజ్ కు తగ్గట్లుగా రేంజ్ రోవర్ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ చూసి షాక్ అయిన జిమ్ ట్రైనర్ లక్షణ్ రెడ్డి తన కుటుంబంతో సహా ప్రభాస్ ఇంటికి వచ్చి ప్రభాస్ కు కృతఙ్ఞతలు తెలియజేసాడు.

హీరోలకు ఫిట్ నెస్ ముఖ్యం అన్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ లాంటి ఆజానుబాహుడుకు ఆ ఫిట్ నెస్ మరింత అవసరం అందుకే లక్ష్మణ్ రెడ్డి నేతృత్వంలో తగిన శిక్షణ పొందుతున్నాడు ప్రభాస్. తనకు బాగా నచ్చిన వ్యక్తి కావడంతో అతడి కష్టానికి నెల నెలా డబ్బులు ఇస్తున్నప్పటికీ తనకు మరింతగా బహుమతి ఇవ్వాలని అనిపించడంతో ఇలా రేంజ్ రోవర్ కారుని బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు ఈ విషయం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యింది ఎందుకంటే ఖరీదైన గిఫ్ట్ కాబట్టి.

తాజాగా ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో చేస్తున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రెండు భారీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు ప్రభాస్ . ఆ సినిమాలతో ప్రభాస్ రేంజ్ మరింతగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి