ప్రభాస్ ద్విపాత్రాభినయం పోషించనున్నాడా

0
30

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా రాధే శ్యామ్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కంప్లీట్ అయ్యాక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం పోషించనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ రెండు పాత్రలు కూడా చాలా విభిన్నంగా ఉండనున్నాయని తెలుస్తోంది. పురాణ కథల్లోని అంశాన్ని తీసుకుని ఇప్పటి కాలానికి అనుగుణంగా కథ రాసుకున్నాడట నాగ్ అశ్విన్. సైన్స్ ఫిక్షన్ చిత్రంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈ భారీ చిత్రానికి నిర్మాత అశ్వనీదత్.

బుర్రా సాయి మాధవ్ మాటలు రాస్తున్నాడట. ప్రభాస్ ని సూపర్ మాన్ గా చూపించే భారీ ప్రయత్నం చేస్తున్నారు నాగ్ అశ్విన్. మహానటి చిత్రంతో సంచలన విజయం సాధించి వైజయంతి మూవీస్ కు మళ్లీ విజయాన్ని అందించాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా కోసం పలువురు బాలీవుడ్ ప్రముఖులను సంప్రదిస్తున్నాడట డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇక హీరోయిన్ గా బాలీవుడ్ భామని తీసుకునే పనిలో పడ్డాడట ఈ డైరెక్టర్. ప్రభాస్ ద్విపాత్రాభినయం , సైన్స్ ఫిక్షన్ స్టోరీ , సూపర్ మ్యాన్ అవతారం , భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వెరసి ప్రేక్షకులకు థ్రిల్ అందించడం ఖాయమని ధీమాగా ఉన్నారట.

మునుపటి వ్యాసంచిరంజీవి చిన్నల్లుడికి కరోనా
తదుపరి ఆర్టికల్నెటిజన్లను ఆకర్షిస్తున్న ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్ మేడ్ పోస్టర్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి