ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రభాస్ డైరెక్టర్

0
41
mahanati directorer nag aswin

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్- యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాడు. ఈ డైరెక్టర్ ఏ విషయంలో ప్రశ్నిస్తున్నాడో తెలుసా ……. థియేటర్ ల విషయంలో. అవును బార్లు , పబ్ లు , జిమ్ , దేవాలయాలు , మెట్రో ట్రైన్ లను తెరిచారు కానీ ఇంకా థియేటర్ లను ఓపెన్ చేయలేదు వాటిని మాత్రం ఇంకా ఎందుకు మూతవేయడం వాటిని కూడా తెరిచేందుకు ఇదే సరైన సమయం అంటూ ట్వీట్ చేసాడు నాగ్ అశ్విన్.

ఇంకా ఇంట్లో కూర్చొని ఉండలేకపోతున్నా , థియేటర్ లో సినిమా చూడాలని ఆశపడుతున్నా ……. ముఖానికి మాస్క్ వేసుకొని సినిమా చూడటానికి నేను రెడీ అంటూ సంకేతాలు ఇస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. కొత్త సినిమా విడుదల అయ్యిందంటే చాలు హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో ఉదయం 8 గంటల ఆట చూడటం నాగ్ అశ్విన్ కు అలవాటు. ఒక్క నాగ్ అశ్విన్ కు మాత్రమే కాదు పలువురు సినీ ప్రముఖులు కుటుంబ సమేతంగా ప్రసాద్ ఐమాక్స్ లో విడుదల రోజునే సినిమాలను చూస్తారు.

అయితే కరోనా వల్ల గత ఏడు నెలలుగా థియేటర్ లన్ని మూతబడ్డాయి. అయితే లాక్ డౌన్ తర్వాత అన్ లాక్ ప్రక్రియలో ఒక్కో రంగానికి మినహాయింపు ఇస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. అయితే ఇప్పటివరకు అన్ని రకాల రంగాలకు మినహాయింపులు ఇచ్చినప్పటికీ థియేటర్ లకు మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు దాంతో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాడు ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్. ఇప్పటికే అన్ని కూడా దాదాపుగా తెరుచుకున్నాయి కాబట్టి ఇక త్వరలోనే థియేటర్ లకు కూడా అనుమతి రావడం ఖాయమని భావిస్తున్నారు సినీ ప్రేమికులు. 

మునుపటి వ్యాసంనేహశర్మ ఫొటోస్
తదుపరి ఆర్టికల్దుబ్బాక రెడీ త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి