ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

0
16
prabhas and nag ashwin movie delayed for coronavirus

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అందునా ఉగాది రోజున ఆ బ్యాడ్ న్యూస్ వెలువడటం దారుణం. ఇంతకీ బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా ……. 400 కోట్ల భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సూపర్ మ్యాన్ గా నటించే ఓ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా రూపొందనున్న విషయం తెలిసిందే.

కాగా ఆ సినిమా ఈ ఏడాదిలో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకున్నారు కానీ కరోనా పుణ్యమా అని ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభం కావడం లేదు. అవును ప్రభాస్ – నాగ్ అశ్విన్ ల సినిమా ఈ సంవత్సరం ప్రారంభం కావడం లేదు. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎందుకంటే గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్లతో ముందుగా మాట్లాడాలి కాబట్టి దాని వల్ల సమయం పడుతుంది కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చారట నాగ్ అశ్విన్. ఈ సినిమాని అశ్వనీదత్ నిర్మిస్తుండగా దీపికా పదుకోన్ నటించనుంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి