బాలయ్య, ప్రభాస్ కోటి విరాళం

0
20
Prabhas and Balayya donates rupees 2crs to each telangana andhra pradesh governments

కరోనా ఎఫెక్ట్ తో యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దాంతో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు సినీ ప్రముఖులు. తమని ఆరాధించి స్టార్ డం కట్టబెట్టిన ప్రజలకు కష్టసమయంలో అండగా నిలవాలని భావించిన పలువురు సినీ ప్రముఖులు భారీ విరాళాలను ప్రకటిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించాడు.

అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా కోటి విరాళం ప్రకటించాడు. తెలంగాణ కు 50 లక్షలు ఆంధప్రదేశ్ కు 50 లక్షలు విరాళం ఇవ్వనున్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా 75 లక్షల విరాళం ప్రకటించాడు. తెలంగాణకు 25 లక్షలు ఆంధ్రప్రదేశ్ కు 25 లక్షలు ఇవ్వనుండగా మరో 25 లక్షలను సినీ కార్మికులకు ఇవ్వనున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ , చిరంజీవి , మహేష్ బాబు , చరణ్ , నితిన్ , త్రివిక్రమ్ , అనిల్ రావిపూడి , వివివినాయక్ , సాయిధరమ్ తేజ్ తదితరులు భారీ విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి