ప్రభాస్ – అనుష్క లు కలిసి ఉండాలంటున్న భామ

0
98
telugu heroine

ప్రభాస్ – అనుష్క లు కలిసి ఉండాలంటున్న భామ

హీరోయిన్ కామ్నా జెఠ్మలాని కోరిక ఏంటో తెలుసా…..ప్రభాస్ – అనుష్క లు కలిసి ఉండాలని అలాగే మరో సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటించాలని. కన్నడ భామ అయిన కామ్నా జెఠ్మలాని తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ భామ చేతిలో కొన్ని సూపర్ హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని డిజాస్టర్ లు కూడా ఉన్నాయి. టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన కామ్నా ఆ తర్వాత సినిమాలకు దూరమై ఓ బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేసుకుంటోంది.

తాజాగా ఈ భామ ఓ మీడియా సంస్థకు బెంగుళూరులో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ సందర్భంగా తన అభిమాన హీరో ప్రభాస్ అని హీరోయిన్ అనుష్క అని తెలియజేసింది. తనకు ఎంతో ఇష్టమైన ప్రభాస్ – అనుష్కలు కలిసి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారని మళ్లీ ఇప్పుడు ఇంకో సినిమాలో జంటగా నటిస్తే చూడాలని ఉందని తన కోరికని బయటపెట్టింది. అలాగే ప్రభాస్ – అనుష్క చాలా చూడముచ్చటైన జంట అని వాళ్ళు ఇద్దరూ కలిసి ఉంటే నన్ను మించి సంతోషించే వాళ్ళు ఉండరని సంచలన వ్యాఖ్యలు చేసింది కామ్నా జెఠ్మలాని.

ప్రభాస్ – అనుష్క నిజంగానే చూడముచ్చటైన జంట . అందుకే ప్రేక్షకులు ఈ జంటని మళ్లీ మళ్లీ చూడాలని కోరుతున్నారు. ప్రభాస్ – అనుష్క లు జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. బిల్లా, మిర్చి , బాహుబలి, బాహుబలి 2 ఈ నాలుగు కూడా ఒక సినిమాని మించి మరొకటి సంచలన విజయాలను అందుకున్నాయి. అనుష్క తాజాగా నిశ్శబ్దం అనే పాన్ ఇండియా చిత్రంలో నటించగా ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే మరో రెండు భారీ చిత్రాలను లైన్ లో పెట్టాడు.

మునుపటి వ్యాసంతీవ్ర దుఃఖసాగరంలో ఎన్టీఆర్
తదుపరి ఆర్టికల్అత్యాచారం కేసులో స్పందించిన నటుడు కృష్ణుడు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి