ప్రభాస్ ఆది పురుష్ జనవరి నుండి

0
33
adipursh shooting will start from january

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించనున్న చిత్రం ”ఆది పురుష్ ”. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం 3 డి లో రూపొందనుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం అప్పుడే పక్కాగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. 2021 జనవరి నుండి ఈ సినిమా షూటింగ్ జరుగనున్నట్లు తెలుస్తోంది. జనవరి నుండి దాదాపు రెండు నెలల పాటు భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు. రెండు నెలల పాటు సాగే షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించేలా సన్నాహాలు చేస్తున్నాడు దర్శకుడు ఓం రౌత్.

అసలు ఈలోపు రాధే శ్యామ్ చిత్రం షూటింగ్ లో పాల్గొననున్నాడు ప్రభాస్ . జనవరి నాటికి దాదాపుగా రాధే శ్యామ్ షూటింగ్ కంప్లీట్ చేసి అప్పుడు ఆది పురుష్ షూటింగ్ లో పాల్గొననున్నాడట. ఇప్పటికే రావణాసురుడుగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ని ఎంపిక చేసారు దర్శకుడు ఓం రౌత్. ఇక సీత గా కియారా అద్వానీని అనుకుంటున్నారు. అయితే ఇంకా అధికారికంగా ఈ విషయాన్నీ ప్రకటించాల్సి ఉంది. అలాగే ఇతర నటీనటులను కూడా ఎంపిక చేసే పనిలో ఉన్నాడట దర్శకుడు ఓం రౌత్.

తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ , హిందీ భాషలతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా 10 భాషల్లో కూడా విడుదల చేయాలనీ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ప్రపంచ వ్యాప్తం అయ్యింది అందుకే ఇలా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రభాస్ రేంజ్ పెరిగింది కాబట్టే భారీ బడ్జెట్ పెట్టడానికి కూడా వెనుకాడం లేదు దర్శక నిర్మాతలు. ఒకప్పుడు ప్రభాస్ అంటే టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన హీరో కానీ ఇప్పుడు అసలు సిసలైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రమే. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి