పవర్ స్టార్ విడుదల అయ్యేది ఎప్పుడో తెలుసా

0
44

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా రూపొందించిన చిత్రం పవర్ స్టార్ . పవన్ కళ్యాణ్ సినిమా కాదు అని వర్మ చెబుతున్నా పవర్ స్టార్ అనే టైటిల్ కానీ అచ్చం పవన్ కళ్యాణ్ ని పోలిన మనిషి కానీ టైటిల్ లో జనసేన సింబల్ అయిన గ్లాస్ గుర్తు కానీ ఇవన్నీ పవన్ కళ్యాణ్ మీదే సినిమా అని చెప్పకనే చెబుతున్నాయి. కాగా ఈ సినిమా ఆర్జీవి వరల్డ్ థియేటర్ డాట్ కామ్ లో ఈనెల 25 న అంటే జులై 25 న విడుదల కానుంది. జులై 25 ఉదయం 11 గంటల నుండి ఆర్జీవి వరల్డ్ థియేటర్ డాట్ కామ్ లో ప్రేక్షకులు వీక్షించవచ్చు. ఇక ఈ సినిమా చూడాలంటే ముందుగా డబ్బులు చెల్లించాలి లేదంటే చూడలేరు మరి.

పవర్ స్టార్ చిత్రం మాత్రమే కాదు రాబోయే థ్రిల్లర్ చిత్రం కూడా ఆర్జీవి వరల్డ్ థియేటర్ డాట్ కామ్ లో విడుదల కానుంది. లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడ్డాయి. దాంతో తన థియేటర్ ఓపెన్ చేసాడు వర్మ. తక్కువ సమయంలోనే ఎక్కువ చిత్రాలు చేయడం వాటిని క్యాష్ చేసుకోవడం వర్మకు మాత్రమే చెల్లింది. ఇక మరో అడుగు ముందుకేసి ట్రైలర్ ని చూడాలంటే కూడా 25 రూపాయలు చెల్లించాలని కొత్త రూల్ పెట్టాడు వర్మ. దాంతో మాకెందుకీ ఖర్మ అని తలపట్టుకుంటున్నారు కొంతమంది. టీజర్ , ట్రైలర్ లలో ఉన్నంత విషయం సినిమాలో ఉండదని ప్రేక్షకులకు బాగా తెలుసు అయినప్పటికీ మళ్లీ మళ్లీ ప్రేక్షకులను మోసం చేస్తూనే ఉన్నాడు వర్మ. మోసపోతూనే ఉన్నారు ప్రేక్షకులు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి