పవర్ స్టార్ ట్రైలర్ లీక్ : వర్మ షాక్ తిన్నాడు

0
53


పవర్ స్టార్ ట్రైలర్ చూడాలంటే 25 రూపాయలు చెల్లించాల్సిందే అని ప్రకటించి సంచలనం సృష్టించిన రాంగోపాల్ వర్మ ఎట్టకేలకు షాక్ తిన్నాడు. తనకు తెలిసి అయ్యుండొచ్చు లేదా కావాలనే చేసి ఉండొచ్చు కానీ మొత్తానికి పవర్ స్టార్ ట్రైలర్ నిన్న రాత్రి లీక్ అయ్యింది. మాములుగా అయితే ఈరోజు ఉదయం 11 గంటలకు ఆర్జీవి వరల్డ్ థియేటర్ లో విడుదల కావాల్సి ఉండే కానీ అనూహ్యంగా ట్రైలర్ లీక్ అయ్యింది. ఇక ట్రైలర్ లో యధావిధిగానే హైలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసి ట్రైలర్ లో ఉండేలా ప్లాన్ చేసాడు వర్మ.

2014 లో ఆంధ్రప్రదేశ్ లో శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ దారుణమైన ఓటమి చవి చూసాడు. వర్మ ఎంచుకున్న కథ కూడా ఇదే. పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత అతడు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ? అన్న కథాంశంతో తెరకెక్కించాడు వర్మ. ఈ ట్రైలర్ లో చంద్రబాబు, చిరంజీవి, బండ్ల గణేష్, త్రివిక్రమ్ , రేణు దేశాయ్ ప్రస్తావన అలాగే జగన్ ఇలా అన్ని అంశాలను టచ్ చేసాడు వర్మ. పవన్ కళ్యాణ్ పేరు కాస్త ప్రవన్ కళ్యాణ్ గా మార్చాడు అంతే తేడా. పైగా పవన్ కళ్యాణ్ అభిమానులను మరింతగా రెచ్చగొడుతూ ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు అంకితం అంటూ ప్రకటించాడు వర్మ. ట్రైలర్ పై డబ్బులు కట్టాలి అని చెప్పిన వర్మ ఇప్పుడేమో మాట మార్చాడు. నా ఆఫీసులో ఎవరో కావాలని ఈ ట్రైలర్ ని లీక్ చేసారని దానికి నేనే బాద్యుణ్ణి అంటూ ట్వీట్ చేసాడు వర్మ. ట్రైలర్ కోసం డబ్బులు చెల్లించిన వాళ్లకు త్వరలోనే ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తారట

 

మునుపటి వ్యాసంరూమర్స్ ని ఖండించిన యంగ్ హీరో
తదుపరి ఆర్టికల్మాజీ ఉప ముఖ్యమంత్రికి సోకిన కరోనా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి