పవర్ స్టార్ ఫస్ట్ లుక్ పవన్ ఇజ్జత్ తీసేలా ఉందే

0
38

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కొద్దిసేపటి క్రితం పవర్ స్టార్ ఫస్ట్ లుక్ విడుదల చేశాడు. ఈ ఫస్ట్ లుక్ చూస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోవడం ఖాయం. ఎందుకంటే ఎన్నికల ఫలితాల తర్వాత అని ట్యాగ్ వేసి పవర్ స్టార్ ఫస్ట్ లుక్ విడుదల చేసాడు వర్మ. ఈ ఫస్ట్ లుక్ లో పవన్ కళ్యాణ్ ని పోలిన వ్యక్తి ఓడిపోయి దిగాలుగా కూర్చున్న స్టిల్ వదిలాడు వర్మ. పైగా పవర్ స్టార్ అనే టైటిల్ మధ్యలో జనసేన సింబల్ అయిన గ్లాస్ ని కూడా పెట్టాడు. దాంతో మరింత వివాదం అవ్వడం ఖాయం.

జనసేన సింబల్ తో అలాగే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓడిపోయిన విషయాలతో సినిమా తీస్తే ఫరవాలేదు కానీ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లతో పాటుగా ఇతర వ్యవహారాలను కూడా ఈ పవర్ స్టార్ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కనుక చూపిస్తే పవన్ కళ్యాణ్ ఇజ్జత్ పోవడం ఖాయం. ఇవన్నీ జరిగితే పవన్ కళ్యాణ్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కొద్దిసేపటి క్రితం విడుదలైన పవర్ స్టార్ ఫస్ట్ లుక్ పై పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మునుపటి వ్యాసంఆ సినిమా ప్రభంజనానికి 17 ఏళ్ళు
తదుపరి ఆర్టికల్అనుపమ పరమేశ్వరన్ -ఫొటోస్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి