పోటాపోటీగా విడుదలైన పవర్ స్టార్ , పరాన్న జీవి

0
54

ఈరోజు ఉదయం 11 గంటలకు పోటా పోటీగా విడుదల అయ్యాయి పవర్ స్టార్ , పరాన్న జీవి చిత్రాలు. సెన్సార్ లేకపోవడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా విడుదల అయ్యాయి. పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ అయినట్లుగా ప్రకటించాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. పవర్ స్టార్ చిత్రాన్ని చూడటానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటుగా మిగతా ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారని సాధారణ థియేటర్ ల కంటే ఆర్జీవి వరల్డ్ థియేటర్ కు ఎక్కువ డిమాండ్ ఏర్పడిందని ట్వీట్ చేసాడు వర్మ.

ఇక రాంగోపాల్ వర్మ పై సెటైరికల్ గా పరాన్న జీవి అనే చిత్రం కూడా విడుదల అయ్యింది. ఈ సినిమాని కూడా జనాలు చూస్తున్నారు. అయితే ఎక్కువగా మాత్రం పవర్ స్టార్ చిత్రాన్ని చూస్తున్నారు ఇప్పటి లెక్కల ప్రకారం. పవర్ స్టార్ చిత్రం ఎలా ఉండబోతోందో ట్రైలర్ లోనే చూపించాడు వర్మ. టీజర్ , ట్రైలర్ లతో సినిమాపై అంచనాలు పెంచడం వర్మకు అలవాటు అయితే అసలు విషయం మాత్రం సినిమాలో ఉండదు దాంతో విడుదలకు ముందు ఉన్న ఆసక్తి సినిమా విడుదల అయ్యాక ఉండదు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి