హన్సిక పుట్టినరోజు సందర్భంగా హన్సిక నటిస్తున్న మహా చిత్రం నుండి పోస్టర్

0
24
hansika heroine

అందాల భామ హన్సిక నగ్నంగా బాత్ టబ్ లో ఉన్న పోస్టర్ ని విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈరోజు హన్సిక పుట్టినరోజు దాంతో ఆ సందర్భంగా హన్సిక నటిస్తున్న మహా చిత్రం నుండి పోస్టర్ ని విడుదల చేశారు. మరో విశేషం ఏంటంటే ఈ మహా సినిమా హన్సిక కు 50 వ సినిమా కావడం విశేషం. జామీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా మొత్తం పూర్తయ్యింది. కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ గా ఉంది. హర్రర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

బాత్ టబ్ లో అందునా రక్తపు మడుగులో నగ్నంగా కూర్చొని ఉంది హన్సిక. ఈ అందాల భామ పెట్టిన ఫోజు పై భాగం చూసి అందాలను ఆస్వాదించాలని అనుకుంటారు. అయితే బాత్ టబ్ నిండా రక్తం, ఆ రక్తం లో హన్సిక కూర్చున్న తీరుకి షాక్ అవ్వడం ఖాయం. అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో నటించింది హన్సిక. తెలుగులో మొదటి చిత్రం అది. టాలీవుడ్ లో మంచి పొజిషన్ లో ఉండగానే చెన్నై వెళ్లి అక్కడ మకాం పెట్టింది. చెన్నైలో మకాం పెట్టడంతో ఎక్కువగా తమిళ చిత్రాలు మాత్రమే చేస్తోంది. తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. మరి ఈ మహా చిత్రంతో మళ్లీ తెలుగులో బిజీ అవుతుందేమో చూడాలి.

మునుపటి వ్యాసంమిహీక బజాజ్ కట్టుకున్న లెహేంగా ఎన్ని లక్షలో తెలుసా
తదుపరి ఆర్టికల్మహేష్ రిజెక్ట్ చేసిన ఆ 3 చిత్రాలు కూడా హిట్టే
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి