ఏపీలో స్టూడియో కడతానంటున్న పోసాని

0
50
posani wants build studio in andhra

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్- నటుడు , దర్శక నిర్మాత , రచయిత పోసాని కృష్ణమురళి ఆంధ్రప్రదేశ్ లో స్టూడియో నిర్మిస్తానని అంటున్నాడు. నేను గత 35 సంవత్సరాలుగా సినిమారంగంలో ఉన్నాను కాబట్టి ప్రభుత్వాన్ని స్టూడియో కోసం స్థలం అడిగే హక్కు ఉందని , ఓ 5 ఎకరాలలో ఏపీలో ఏదో ఒక చోట స్టూడియో నిర్మిస్తానని స్పష్టం చేసాడు పోసాని. అయితే నాకు స్టూడియో నిర్మించాలన్న ఆలోచన లేదని , కానీ నా చిన్న కొడుకు ఈ మంచి ఆలోచన చేసాడని ……. ఇలాంటి ఆలోచన నాకు రాలేదని ఆశ్చర్యం వ్యక్తం చేసాడు పోసాని.

త్వరలోనే ప్రతిపాదనలతో రాష్ట్ర ప్రభుత్వానికి స్థలం కోసం అర్జీ పెడతానని , ఐదెకరాల స్థలం పొందే హక్కు ఉందని పునరుద్ఘాటించారు పోసాని. రచయితగా సినిమారంగంలో అడుగుపెట్టిన పోసాని రచయితగా , నటుడిగా , దర్శకుడిగా , నిర్మాతగా అన్ని రకాలుగా రాణించాడు. అయితే సొంత చిత్ర నిర్మాణం దెబ్బ కొట్టడంతో మళ్ళీ సొంత చిత్ర నిర్మాణం చేపట్టలేదు. అయితే రచనని కూడా పక్కన పెట్టి నటుడిగా మాత్రం రాణిస్తున్నాడు పోసాని. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న పోసాని టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసాడు.

అయితే ఒకవైపు నటుడిగా కొనసాగుతూనే మరోవైపు రాజకీయాల పై కూడా దృష్టి పెట్టాడు. వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్ గెలుపు కోసం కృషి చేసాడు పోసాని. చంద్రబాబు పై నిప్పులు చెరిగే పోసాని జగన్ అంటే మాత్రం అమితమైన ప్రేమ. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పోసానికి ఎలాంటి పదవి దక్కలేదు. దాంతో ఇప్పుడు సినిమా రంగం అభివృద్ధి కోసం ఏపీలో స్టూడియో నిర్మించాలని అందుకు యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనీ చూస్తున్నాడు. అందులో భాగంగా స్టూడియో నిర్మాణం కోసం ముఖ్యమంత్రి జగన్ ని ఐదెకరాల స్థలం సబ్సిడీ మీద తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 

మునుపటి వ్యాసంవికారాబాద్ అడవుల్లో రకుల్ షూటింగ్
తదుపరి ఆర్టికల్మోడీపై సంచలన వ్యాఖ్యలు చేసిన  నాని
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి