పోలీసులను ఆశ్రయించిన హాస్య నటుడు ఆలీ

0
78

ప్రముఖ హాస్య నటుడు ఆలీ పోలీసులను ఆశ్రయించారు. తనకు ట్విట్టర్ అకౌంట్ లేనప్పటికీ తన పేరుతో ఎవరో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడమే కాకుండా ఆ ట్విట్టర్ అకౌంట్ నుండి రెగ్యులర్ గా రకరకాల పోస్ట్ లు చేస్తున్నారని, ఇవి తనకు సంబందం లేదని వెంటనే ఈ ట్విట్టర్ అకౌంట్ ని రన్ చేస్తున్న వాళ్ళని అదుపులోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు ఆలీ. గత కొద్ది రోజులుగా ఆలీ అఫీషియల్ అకౌంట్ ఇదే అన్నట్లుగా తయారు చేసి ట్వీట్ లు పెడుతున్నారు. దాంతో ఈ విషయం ఆలీ కి తెలియడంతో షాక్ అయ్యాడు.

తనకు సంబంధం లేకుండా అకౌంట్ ఓపెన్ చేయడమే కాకుండా ట్వీట్ లు కూడా పెడుతున్నారు కాబట్టి రేపటి రోజున తప్పుడు ట్వీట్ లు పెడితే తన ప్రతిష్టకు భంగం కలుగుతుంది కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏసీపీ రోహిణి కి ఫిర్యాదు చేశారు ఆలీ. ఫిర్యాదుని స్వీకరించిన ఏసీపీ రోహిణి దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏపీ లో ఎన్నికలకు ముందు జగన్ ని కలిసిన అనంతరం వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాగా జగన్ తో కలిసి దిగిన ఫోటోని ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ గా పెట్టారు. దాంతో ఆలీ మండిపడుతున్నాడు.  

మునుపటి వ్యాసంస్మిత ఫేస్ బుక్ లో నగ్న ఫోటోల కలకలం
తదుపరి ఆర్టికల్ఉత్తరప్రదేశ్ సీఎం అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి