ఆర్ ఎక్స్ 100 నిర్మాత కోసం పోలీసుల గాలింపు

0
28
rx100 movie producer

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్–  టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసారు పోలీసులు. ఇక ఆర్ ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. నటి శ్రావణి కేసులో నిర్మాత అశోక్ రెడ్డి కూడా నిందితుడే అని తేల్చి చెప్పారు పోలీసులు. నటి శ్రావణి జీవితంతో ఈ ముగ్గురూ ఆడుకున్నారని అందుకే ముగ్గురిపై కేసు నమోదు చేశామని , అయితే దేవరాజ్ , సాయి లను అరెస్ట్ చేశామని అశోక్ రెడ్డికి ఫోన్ చేస్తుంటే సోమవారం రోజున వస్తానని చెప్పి ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసాడని , అందువల్ల అతడిపై మా అనునామాలు మరింతగా బలపడ్డాయని అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని ప్రకటించారు.

సీరియల్ నటి శ్రావణి మొదట సాయి ప్రేమలో పడింది , ఆ తర్వాత ఆర్ ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి తో కూడా చనువుగా ఉంది . ఇక కొంతకాలం నుండి దేవరాజ్ తో ప్రేమాయణం సాగిస్తోంది. మొత్తానికి ఈ ముగ్గరు కూడా శ్రావణిని పెళ్లి చేసుకుంటామని ఏదో ఒక దశలో అన్నవాళ్ళే. అందుకే ఏ 1 సాయి ని ఏ 2 గా అశోక్ రెడ్డిని ఏ 3 గా దేవరాజ్ ని చేర్చామని స్పష్టం చేసారు పోలీసులు.

అయితే ఆర్ ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి తో నటి శ్రావణి మాట్లాడుతున్న ఆడియో క్లిప్ కూడా మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణకు హాజరు అవుతానని చెప్పిన అశోక్ రెడ్డి తీరా సమయానికి ఫోన్ స్విచాఫ్ చేయడమే కాకుండా విచారణకు రాకుండా అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోవడంతో అతడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. మొత్తానికి నటి శ్రావణి ఉదంతం మరోసారి అమ్మాయిలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. 

మునుపటి వ్యాసంరైతుల సమస్యలపై సినిమా తీయనున్న రేణు దేశాయ్
తదుపరి ఆర్టికల్కన్నీళ్ల పర్యంతమైన సుమ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి