నటులు విమల్ , సూరి లపై కేసు నమోదు చేసిన పోలీసులు

0
17
sury tamil comedian

తమిళ నటులు విమల్ , సూరి లపై కేసు నమోదు చేశారు పోలీసులు. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉండకుండా కోడైకనాల్ కు వెల్లడమే వీళ్ళు చేసిన నేరం. లాక్ డౌన్ సమయంలో బయటకు వెళ్లాలంటే ముందుగా పోలీసుల అనుమతి తప్పనిసరి కానీ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చెన్నై నుండి కోడైకనాల్ వెళ్లారు. అలాగే కోడైకనాల్ లోని నిషేధిత ప్రాంతానికి వెళ్లారు. అంతేనా అక్కడ సరస్సులో చేపలు పట్టుకొని హాయిగా వండుకొని తిన్నారు ఎంజాయ్ చేశారు. తిరిగి చెన్నై చేరుకున్నారు. అయితే తిరుగు ప్రయాణంలో అటవీ అధికారులు అడ్డుకున్నారు. జరిమానా విధించి మందలించి పంపించారు. దాంతో హమ్మయ్య గండం గడిచింది అని అనుకున్నారు.

కట్ చేస్తే ఇన్ని రోజుల తర్వాత రంగంలోకి దిగారు తమిళనాడు పోలీసులు. విమల్ , సూరి ప్రయాణించిన కార్లను , అలాగే ఈ ఇద్దరికి వసతి ఏర్పాటు చేసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విమల్ , సూరి లపై కేసు కూడా నమోదు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారట పోలీసులు. దాంతో ఇదెక్కడి చిక్కురా బాబూ అంటూ రాజకీయ నాయకుల అండ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. సూరి హాస్య నటుడిగా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం. తమిళంలో హీరోలకు ఫ్రెండ్ గా నటిస్తుంటాడు సూరి. మంచి హాస్య నటుడు. కానీ ఇలా నిబంధనలు అతిక్రమించి కేసులో ఇరుక్కున్నాడు పాపం.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి