రాహుల్ గాంధీపై పోలీసుల దాడి

0
42

కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పై ఉత్తరప్రదేశ్ పోలీసులు దాడి చేసారు. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ కు చెందిన దళిత యువతిని అత్యంత కిరాతకంగా నలుగురు యువకులు అత్యాచారం చేసిన ఘటన యావత్ భారతాన్ని అట్టుడికేలా చేసింది. అయితే ఆ యువతి చనిపోవడంతో అర్దాంతరంగా అంత్యక్రియలు నిర్వహించారు దాంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీతో పాటుగా మానవ హక్కుల సంఘం భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. బాధిత యువతి కుటుంబాన్ని పరామర్శించడానికి హత్రాస్ కు బయలుదేరారు రాహుల్ గాంధీ , ప్రియాంకా గాంధీ.

అయితే హత్రాస్ కు వెళ్లకుండానే మార్గమధ్యంలోనే రాహుల్ గాంధీ ని అడ్డుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు జాతీయ నాయకుడు అన్న స్ప్రుహ కూడా లేకుండా రాహుల్ పై చేతులు వేస్తూ నెట్టివేస్తూ కిందపడేసారు. రాహుల్ గాంధీ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. దాంతో తీవ్ర అవమానంగా భావించిన రాహుల్ యూపీ పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేసాడు. రాహుల్ గాంధీ ని నిలువరించడానికి ఏకంగా రాహుల్ చొక్కా ని పట్టుకొని నెట్టేసే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాధిత యువతికి న్యాయం చేయాల్సింది పోయి అర్దాంతరంగా అంత్యక్రియలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందంటూ ప్రధాని మోడీ ని , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిని ప్రశ్నిస్తున్నాడు రాహుల్. మోడీ రోడ్డు మీద నడవొచ్చు కానీ నేను నడవకూడదా ? నాకు అనుమతి ఇవ్వరా ? ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ నిప్పులు చెరిగాడు రాహుల్ గాంధీ. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ కు చెందిన 20 ఏళ్ల దళిత యువతిని నలుగురు యువకులు నాలుక కోసి  , నడుం విరగ్గొట్టి అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసారు. ఈ సంఘటనలో ఆ యువతి చికిత్స పొందుతూ మరణించింది. 

మునుపటి వ్యాసంకేసీఆర్ మనవడికి గాయాలు
తదుపరి ఆర్టికల్నిశ్శబ్దం రివ్యూ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి