ఆర్ ఎక్స్ 100 నిర్మాతని అదుపులోకి తీసుకున్న పోలీసులు

0
17
rx100 movie producer

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్కార్తికేయ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో అశోక్ రెడ్డి నిర్మించిన చిత్రం ” ఆర్ ఎక్స్ 100 ”. 2018 లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కట్ చేస్తే ఆ చిత్ర నిర్మాత ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిర్మాత అశోక్ రెడ్డి కూడా ఒక నిందితుడు కావడంతో అశోక్ రెడ్డి ని విచారణకు పిలిచారు పోలీసులు. అయితే మొదట విచారణకు వస్తానని చెప్పిన అశోక్ రెడ్డి ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసి అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోవడంతో అశోక్ రెడ్డి ని శ్రావణి కేసులో ఏ 3 గా పేర్కొంటూ అరెస్ట్ తప్పదు అంటూ హెచ్చరికలు జారీ చేసారు.

దాంతో ఈరోజు పోలీసుల ముందు లొంగిపోయాడు నిర్మాత అశోక్ రెడ్డి. హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీసుల ముందు హాజరు కాగా అతడ్ని వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కరోనా టెస్ట్ చేయించాక అరెస్ట్ విషయాన్నీ అధికారికంగా వెల్లడించనున్నారు పోలీసులు. నటి శ్రావణి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో దేవరాజ్ ని ఏ 1 గా సాయి ని ఏ 2 గా అశోక్ రెడ్డిని ఏ 3 గా చేర్చారు పోలీసులు.

దేవరాజ్ రెడ్డి , సాయి రెడ్డి , అశోక్ రెడ్డి ఈ ముగ్గురు కూడా నటి శ్రావణిని ప్రేమలోకి దించారు , ఆశలు కల్పించారు. తీరా సమయానికి దేవరాజ్ ని పెళ్లి చేసుకోమని శ్రావణి కోరగా అందుకు దేవరాజ్ నిరాకరించడం అశోక్ రెడ్డి తో పాటు సాయి కూడా శ్రావణిని బెదిరించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. ఈ ముగ్గురినీ నమ్మి శ్రావణి తన జీవితాన్ని అర్దాంతరంగా ముగించింది. 

మునుపటి వ్యాసం51 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శివగామి
తదుపరి ఆర్టికల్అక్టోబర్ 2 న అనుష్క నిశ్శబ్దం
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి