పెళ్లి నాటి ఫోటోని షేర్ చేసిన డాక్టర్ రాజశేఖర్

0
23

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ తన పెళ్లి నాటి ఫోటోని షేర్ చేసాడు. ఇంకేముంది ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈరోజు డాక్టర్ రాజశేఖర్ – జీవితల పెళ్లి రోజు. 1991 జులై 11 న పెళ్లి చేసుకున్నారు డాక్టర్ రాజశేఖర్ – జీవితలు. అంతకుముందు పలు చిత్రాల్లో కలిసి నటించారు. దాంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారు కానీ జీవితను రాజశేఖర్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు పెళ్లి చేసుకోవడానికి . సరిగ్గా అదేసమయంలో మగాడు షూటింగ్ లో రాజశేఖర్ కాలు విరగడంతో అతడ్ని దగ్గరుండి చూసుకోవడంతో రాజశేఖర్ కు తగ్గ భార్య అని వీళ్ళ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పెద్దలు దాంతో 1991లో పెళ్లి చేసుకున్నారు.

ఇప్పుడు ఆ ఇద్దరికి ఇద్దరు అమ్మాయిలు. ఒకరు శివాని మరొకరు శివాత్మిక. ఆల్రెడీ శివాత్మిక హీరోయిన్ గా దొరసాని చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఇక శివాని కూడా హీరోయిన్ గా త్వరలో పరిచయం కాబోతోంది. రాజశేఖర్ ఆమధ్య కల్కి చిత్రంలో నటించాడు. మళ్లీ హీరోగా నటించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకవైవు కూతుర్లు ఇద్దరు కూడా హీరోయిన్ లు అయినప్పటికీ తాను మాత్రం ఇంకా హీరోగానే నటించాలని భావిస్తున్నాడు. ఇక ఈరోజు పెళ్లిరోజు కావడంతో పెళ్లి నాటి ఫోటో ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు రాజశేఖర్. ఆ ఫోటో వైరల్ అవుతోంది.  

మునుపటి వ్యాసంహాలీవుడ్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన భామ
తదుపరి ఆర్టికల్రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ పై విమర్శలు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి