పెద్ద హీరో తో తరుణ్ భాస్కర్ మూవీ,ఓ విభిన్న కథని ఎంచుకున్నాడట

0
62

పెళ్లిచూపులు చిత్రంతో సంచలన విజయం సాధించిన తరుణ్ భాస్కర్ తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కథ వినిపించాడు. ఎన్టీఆర్ కోసం ఓ విభిన్న కథని ఎంచుకున్నాడట. ముందుగా ఎన్టీఆర్ కు స్టోరీ లైన్ వినిపించగా అది నచ్చడంతో స్క్రిప్ట్ డెవలప్ చేయమని చెప్పాడట దాంతో కొంత స్క్రిప్ట్ డెవలప్ చేసి చెప్పగా అది ఎన్టీఆర్ కు నచ్చిందట. మిగతా స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేయమని చెప్పాడట ఎన్టీఆర్. దాంతో ఆపని పూర్తి చేసే పనిలో ఉన్నాడు తరుణ్ భాస్కర్.

ఎన్టీఆర్ తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఆ సినిమా అయ్యాక మరో రెండు మూడు ప్రాజెక్ట్ లతో బిజీ కానున్నాడు. అయితే ఆ సినిమాలను పక్కన పెట్టి తరుణ్ భాస్కర్ సినిమా చేస్తాడా ? లేక ఆ సినిమాల తర్వాత చేస్తాడా ? అన్నది తేలాల్సి ఉంది. ఇక తరుణ్ భాస్కర్ విషయానికి వస్తే మై కడవులే అనే రీమేక్ చిత్రానికి మాటలు రాస్తున్నాడు. అలాగే వెంకటేష్ హీరోగా మరో సినిమాని ప్లాన్ చేస్తున్నాడు తరుణ్ భాస్కర్.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి