పవన్ కళ్యాణ్ సినిమాకు ఎన్టీఆర్ టైటిల్స్ పెట్టనున్నారా ?

0
55

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన కథ కావడంతో ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారు దర్శకుడు క్రిష్. ప్రస్తుతం విరూపాక్ష అనే టైటిల్ తోనే షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగ గా నటిస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద వచ్చేలా గజదొంగ , లేదా బందిపోటు అనే రెండు రకాల టైటిల్స్ గురించి కూడా ఆలోచన చేస్తున్నారట క్రిష్. పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటేనే ఈ రెండు టైటిల్స్ లో ఏదో ఒకటి పెట్టడం ఖాయమని దాని వల్ల మాస్ ఫ్యాన్స్ ని విపరీతంగా అలరించడం ఖాయమని భావిస్తున్నారట.

బందిపోటు , గజదొంగ అనే రెండు సినిమాల టైటిల్స్ కూడా సీనియర్ హీరో ఎన్టీఆర్ నటించిన సినిమాలవి. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ లు అయ్యాయి అప్పట్లో. కట్ చేస్తే అవే టైటిల్స్ తన సినిమాకు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట పవన్ అండ్ కో. పైగా సినిమాకు యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఇందులో పవన్ కళ్యాణ్ బందిపోటు గా నటిస్తున్నాడు మరి. ఇప్పటికే ఓ రెండు షెడ్యూల్ లు కంప్లీట్ చేసుకుంది ఈ చిత్రం. కరోనా తగ్గిన తర్వాత మిగతా షూటింగ్ పూర్తి చేసుకోనుంది.

మునుపటి వ్యాసంస్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన నిర్మాతలు
తదుపరి ఆర్టికల్పెళ్ళైనా శృంగార సన్నివేశాల్లో నటిస్తానంటున్న భామ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి