బండ్ల గణేష్ కు షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

0
31
pawan kalayanmovie with producer ganesh

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ కు షాక్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ తో మళ్ళీ సినిమా చేయాలనీ ఆశపడుతున్న బండ్ల గణేష్ కు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఎట్టకేలకు సినిమా చేసుకోమని చెప్పాడు దాంతో తన దేవుడు పిలిచి మరీ సినిమా చేసుకోమన్నాడని ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి తన సంతోషాన్ని పవర్ స్టార్ అభిమానులతో పంచుకున్నాడు బండ్ల గణేష్.

ఇంతకుముందు పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ , గబ్బర్ సింగ్ అనే రేడు చిత్రాలను నిర్మించాడు బండ్ల గణేష్. తీన్ మార్ ప్లాప్ కావడంతో బండ్లని పిలిచి మరీ గబ్బర్ సింగ్ సినిమా ఇచ్చాడు పవన్. ఇక గబ్బర్ సింగ్ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనీ అనుకున్నాడు కానీ పవన్ డేట్స్ ఇవ్వలేదు. మళ్ళీ ఎనిమిది సంవత్సరాల తర్వాత బండ్ల గణేష్ ని పిలిచి మరీ సినిమా చేసుకోమని చెప్పాడట.

ఇక ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో బద్రి , కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాలు వచ్చాయి. బద్రి చిత్రం పూరి జగన్నాధ్ మొదటి చిత్రం కావడం విశేషం. ఈరోజు పూరి ఈ స్థాయిలో ఉన్నాడంటే అప్పుడు పవన్ కళ్యాణ్ చూపించిన చొరవే కారణం. బద్రి పెద్ద హిట్ అయింది కానీ కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో ఈసారి సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టాలని కసిగా ఉన్నాడట పూరి. కాంబినేషన్ ని సెట్ చేయడంలో బండ్ల గణేష్ ది అందెవేసిన చేయి కావడంతో మరోసారి బండ్ల సత్తా చాటే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి