పవన్ అన్నా నేను మీ తమ్ముడ్ని అంటున్న కేటీఆర్ !

0
16
Pawan Kalyan Says Sir KTR Says i am Brother Always

పవన్ అన్నా …….. నేను మీ తమ్ముడ్ని ……. సార్ అని కాదు తమ్ముడూ అని పిలువు అంటూ పవన్ కళ్యాణ్ కు ట్వీట్ చేసాడు తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్. కరోనా నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో తాను తెలంగాణకు 50 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా కేటీఆర్ సార్ అని సంబోదించాడు. దాంతో నన్ను సార్ అని పిలవడం ఎప్పుడు మొదలు పెట్టావ్ ? అన్నా ……. నేను నీ తమ్ముడ్ని అంటూ కేటీఆర్ ట్వీట్ చేసాడు.

దానికి స్పందించిన పవన్ కళ్యాణ్ అలాగే తమ్ముడూ ! అని రీ ట్వీట్ చేసాడు. ఆసక్తికరంగా సాగిన ట్వీట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయంగా కేసీఆర్ ని కేటీఆర్ ని తీవ్రంగా విబేధించే పవన్ కళ్యాణ్ తర్వాత తన ధోరణి మార్చుకున్నాడు. కేసీఆర్ , కేటీఆర్ పనితీరు మెచ్చుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. ఏపీలో జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి పవన్ ఓడిపోయినప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాజాగా మళ్ళీ కెమెరా ముందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి