పవన్ కళ్యాణ్ కొత్త సినిమా సురేందర్ రెడ్డితో

0
47
pk

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు సినిమాలను అంగీకరించి రెండు సినిమాలను సెట్ మీదకు తీసుకెళ్లిన పవన్ కళ్యాణ్ నాలుగో చిత్రాన్ని కూడా అంగీకరించాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని సెప్టెంబర్ 1 న అధికారికంగా ప్రకటించనున్నారట. సురేందర్ రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట పవన్. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు దాంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 1 న ఈ కొత్త సినిమా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

సురేందర్ రెడ్డి ఇంతకుముందు మెగా హీరోలు అయిన చిరంజీవి తో సైరా నరసింహారెడ్డి చిత్రం చేసాడు. చరణ్ తో దృవ చిత్రం చేసాడు అలాగే అల్లు అర్జున్ తో రేసుగుర్రం చిత్రం చేసాడు. ఈ మూడు కూడా సూపర్ హిట్ అయ్యాయి దాంతో సురేందర్ రెడ్డి పై గురి కుదిరిందట. ఇక ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ అంటే అభిమానించే రామ్ తాళ్లూరి నిర్మించడానికి ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా అధికార ప్రకటన ఉంటుంది కానీ షూటింగ్ అంటే మాత్రం 2022 తర్వాత మాత్రమే ఎందుకంటే వకీల్ సాబ్ పూర్తి కావాలి. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమా పూర్తి కావాలి. దాని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి అప్పుడు కానీ సురేందర్ రెడ్డి సినిమా లైన్ లోకి రాదు మరి. మొత్తానికి ఈ కాంబినేషన్ లో సినిమా అంటే మెగా ఫ్యాన్స్ కు చాలా సంతోషకరమైన వార్త అనే చెప్పాలి.

మునుపటి వ్యాసంనాని సినిమాకు ఓటిటిలో భారీ ఆఫర్
తదుపరి ఆర్టికల్నిహారిక ఎంగేజ్ మెంట్ జరిగింది
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి