పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు పండగే పండగ

0
36
pawan kalayan birthday celebrations

ఈరోజు పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున పండగ చేసుకుంటున్నారు. ఈరోజు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 సినిమాలకు సంబంధించి విశేషాలను వెల్లడిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ విడుదల కాగా మధ్యాహ్నం క్రిష్ – పవన్ కల్యాణ్ ల సినిమా విశేషం వెల్లడించనున్నారు. ఇక సాయంత్రం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం గురించి ప్రకటన చేయనున్నారు. అంటే ఈ ఒక్క రోజే మూడు సినిమాలు విశేషాలను వెల్లడిస్తున్నారు.

వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ :

అగ్ర నిర్మాత దిల్ రాజు పవన్ కల్యాణ్ తో సినిమా నిర్మించాలని 14 ఏళ్లుగా ఆశిస్తున్నాడు కానీ ఆ కల కలగానే మిగిలిపోయింది అని మదన పడుతున్న సమయంలో పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ తన సినిమాతోనే అని తెలిసి చాలా సంతోషించాడు. హిందీలో విజయం సాధించిన పింక్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇమేజ్ కు తగ్గట్లుగా కొన్ని మార్పులు చేసి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ వకీల్ సాబ్ చిత్రాన్ని నిర్మించారు దిల్ రాజు. తమన్ అందించిన పాటలు , నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఇక తాజాగా విడుదలైన వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ అభిమానులను విశేషంగా అలరిస్తోంది.

పవన్ కల్యాణ్ ఏడాదికి లేదంటే రెండేళ్లకు ఒక సినిమా చేసేవాడు కానీ అనూహ్యంగా ఒకేసారి మూడు సినిమాలు ప్రకటించడం అందులో రెండు సినిమాలు సెట్స్ మీదకు తీసుకెళ్లడం చూసి టాలీవుడ్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. పవన్ స్పీడ్ చూసి షాక్ అయ్యారు. అయితే పవన్ స్పీడ్ పై నీళ్లు చల్లుతూ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో 5 నెలలుగా షూటింగ్ లన్నీ ఆగిపోయాయి. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత వకీల్ సాబ్ షూటింగ్ లో పాల్గొననున్నాడు. వకీల్ సాబ్ దాదాపు 90 శాతం షూటింగ్ అయిపోయింది. మిగిలిన భాగాన్ని పూర్తి చేసి వకీల్ సాబ్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

మునుపటి వ్యాసంవిషాదం : పవన్ కల్యాణ్ అభిమానులు మృతి
తదుపరి ఆర్టికల్పవన్ కల్యాణ్ క్రిష్ లుక్ కూడా వచ్చేసింది
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి