షాకింగ్ ట్రీట్ ఇస్తున్న పవన్ కల్యాణ్

0
50
pawan kalyan about new movies

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్పవర్ స్టార్ పవన్ కల్యాణ్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు. ఇప్పటికే వరుసగా మూడు సినిమాలు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చిన పవన్ తాజాగా మరో షాక్ ఇస్తున్నాడు. రేపు సెప్టెంబర్ 2 అంటే పవన్ కల్యాణ్ పుట్టినరోజు దాంతో ఆ సందర్భంగా మరో కొత్త సినిమా అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ కొత్త సినిమాకు దర్శకత్వం వహించేది ఎవరో తెలుసా…….. సురేందర్ రెడ్డి. అవును గత ఆరేళ్లుగా మెగా కాంపౌండ్ లోనే సినిమాలు చేస్తున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయడానికి పవన్ కల్యాణ్ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రకటన బహుశా రేపు ఉండొచ్చని తెలుస్తోంది.

ఆరేళ్ళ క్రితం అల్లు అర్జున్ హీరోగా రేసుగుర్రం అనే బ్లాక్ బస్టర్ చిత్రం చేసాడు సురేందర్ రెడ్డి. ఆ సినిమా తర్వాత రాంచరణ్ తో ధృవ వంటి మరో బ్లాక్ బస్టర్ చిత్రం చేసాడు. ఆ రెండు పెద్ద హిట్స్ కావడంతో మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహారెడ్డి చిత్రం చేసే
గోల్డెన్ ఛాన్స్ లభించింది సురేందర్ రెడ్డికి. మెగా కాంపౌండ్ లో చేసిన ఈ మూడు చిత్రాలు కూడా పెద్ద హిట్ కావడంతో ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ లభించింది. సైరా నరసింహారెడ్డి చిత్రానికి పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలోనే సురేందర్ రెడ్డి పట్ల సానుకూల వైఖరి ఏర్పడిందట పవన్ కల్యాణ్ కు. ఇక తాజాగా సురేందర్ రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఈ సినిమా బహుశా 2021 చివర్లో లేదంటే 2022 లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న వకీల్ సాబ్ షూటింగ్ కొంత బ్యాలెన్స్ ఉంది దాన్ని పూర్తి చేసిన తర్వాత క్రిష్ సినిమా పూర్తి చేయనున్నాడు. ఆ తర్వాత  హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు పవన్ . అంటే ఇవి అయ్యాక సురేందర్ రెడ్డి సినిమా ఉంటుందన్న మాట. మొత్తానికి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు సంతోషమే సంతోషం అన్నమాట.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి