సంచలనం సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ కామన్ డీపీ

0
63
COMMON DP OF PK

TMN -HYD -పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కామన్ డీపీ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో కామన్ డీపీ విడుదల చేసారు. ”సేనాని ” అనే టైటిల్ తో విడుదల అయిన ఈ కామన్ డీపీలో పవన్ కళ్యాణ్ గుబురు గడ్డంతో రఫ్ లుక్ లో అదరహో అనిపించేలా ఉన్నాడు. సేనాని అనే టైటిల్  తగ్గట్లుగా పవన్ రఫ్ లుక్ అభిమానులను అలరించేలా ఉండటంతో సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది. పవన్ అభిమానులు ట్వీట్ లను రీ ట్వీట్ చేస్తూ ట్విట్టర్ లో వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

ఈరోజు ఆగస్టు 16 అయితే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2 అంటే మరో  గడువు ఉన్నప్పటికీ రెండు వారాల ముందుగానే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు సిద్ధం అవుతున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు సినిమాలను అంగీకరించగా మరో సినిమా కూడా లైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమాలు తాలూకు అసలు విషయం సెప్టెంబర్ 2 న తేలనుంది. పవన్ కళ్యాణ్ కామన్ డీపీ 50 మిలియన్ ట్వీట్ లను క్రాస్ చేసింది. దాంతో తక్కువ సమయంలోనే అత్యధిక ట్వీట్ లను సాధించిన హీరోగా పవన్ కళ్యాణ్ అరుదైన రికార్డ్ సృష్టించాడు. 

మునుపటి వ్యాసంమరో నటుడి ఎంగేజ్ మెంట్
తదుపరి ఆర్టికల్కండోమ్ భామకు అవకాశాలు కావాలట
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి