పవన్ కళ్యాణ్ ఇప్పుడే గుర్తొచ్చాడా అంటున్న ఫ్యాన్స్

0
78

హాస్య నటుడు అలీ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ – అలీ ఇద్దరు కూడా మంచి స్నేహితులు. కానీ 2019 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. దాంతో షాక్ అవ్వడం పవన్ కళ్యాణ్ వంతు అయ్యింది. తనకు ఎంతో మంచి మిత్రుడైన అలీ తన పార్టీలో కాకుండా జగన్ పార్టీలో చేరడం పవన్ కళ్యాణ్ కు మాత్రమే కాకుండా వాళ్ళిద్దరి గురించి తెలిసిన వాళ్ళు కూడా షాక్ అయ్యారు. అంతేకాదు ఒక దశలో మాటలు కూడా అనుకున్నారు. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది.

అప్పటి నుండి పవన్ కళ్యాణ్ కు అలీ కి మద్య మాటలు లేవు. కట్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్నేహాన్ని కోరుకుంటున్నాడు అలీ. పవన్ కళ్యాణ్ స్నేహం కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పడం , పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి కామెంట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే అలీ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. కొంతమంది అలీ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే మరికొంతమంది మాత్రం అలీ ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే అలీ జగన్ పార్టీలో చేరాడు కానీ ఏ పదవి కూడా లభించలేదు కదా ….. అందుకే పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు అని విమర్శలు గుప్పిస్తున్నారు.  

మునుపటి వ్యాసంహిందీలో రీమేక్ అవుతున్న హిట్ చిత్రం
తదుపరి ఆర్టికల్రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్న విజయ్ ఎన్నికల కోసమేనా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి