జగన్ ని ఓడించాలని కసిగా ఉన్నాడట పవన్

0
22
Pawan says that it is Kasi to defeat Jagan

2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ ని ఓడించాలని ,ముఖ్యమంత్రి పీఠం నుండి దించాలని కసిగా ఉన్నాడట జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అందుకే 2022 వరకు ఒప్పుకున్న సినిమాలను అంగీకరించి 2022 తర్వాత నుండి రెండేళ్ల పాటు రాజకీయ కార్యక్రమాలతో పోరు సాగించాలని నిర్ణయానికి వచ్చాడట పవన్ కళ్యాణ్. తాజాగా మూడు చిత్రాలు అంగీకరించాడు పవన్. అందులో వకీల్ సాబ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. ఇక క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరూపాక్ష అనే చిత్రం కంప్లీట్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నాడు. అంటే ఈ మూడు కంప్లీట్ కావాలంటే 2021మాత్రమే కాదు 2022 కూడా అయిపోయేలా కనిపిస్తోంది.

ఈ మూడు చిత్రాలు కంప్లీట్ అయ్యాక ఇంకా ఏమైనా ఖాళీ దొరికితే మరో సినిమా కూడా చేయాలని భావిస్తున్నాడట పవన్. ఇక ఈ సినిమాలు పూర్తి అయ్యాక తన దృష్టి మొత్తం రాజకీయాల మీద పెట్టనున్నాడట. జగన్ ని అధికార పీఠం నుండి దించాలని కంకణం కట్టుకున్నాడట. అందుకే జగన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాజకీయ కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడట. 2022 నుండి 2024 వరకు రకరకాల కార్యక్రమాలను చేపట్టి పార్టీని మరింతగా బలోపేతం చేసే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో కలిసి పోరాటం చేయనున్నాడట. కేంద్రంలోని పెద్దల ఆశీర్వాదం ఉంది కాబట్టి జగన్ ని దించడం పెద్ద పని కాదని భావిస్తున్నాడు పవన్. అయితే గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించిన జనసేన 2024 లో అధికారం పొందగలదా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి