పసివాడి ప్రాణం సంచలనానికి 33 ఏళ్ళు

0
50
TMN logo
TMN logo

మెగాస్టార్ చిరంజీవి , విజయశాంతి జంటగా నటించిన పసివాడి ప్రాణం చిత్రం విడుదలై నేటికి 33 సంవత్సరాలు. 1987 జులై 23 న విడుదల అయ్యింది పసివాడి ప్రాణం చిత్రం. ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించడం విశేషం. మలయాళంలో సంచలన విజయాన్ని సాధించిన చిత్రాన్ని తెలుగులో పసివాడి ప్రాణం గా రీమేక్ చేశారు. మాలయాలంలో అప్పటి మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించగా ఆ పాత్రలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించారు. 1987 లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో తెలుగునాట ప్రభంజనం సృష్టించింది. అప్పట్లోనే 4 కోట్ల 75 లక్షల వసూళ్లని సాధించింది. అంటే ఇప్పటి లెక్కల్లో 100 కోట్ల పై మాటే.

పసివాడి పాత్రలో మలయాళ నటి సుజిత నటించింది. ఇప్పుడు తెలుగులో పలు సీరియల్ లలో సుజిత నటిస్తోంది కూడా. అలాగే హీరోయిన్ లుగా విజయశాంతి , సుమలత నటించగా ఇతర పాత్రల్లో రఘువరన్ , కన్నడ ప్రభాకర్ , అల్లు రామలింగయ్య , గిరిబాబు , రాజ్యలక్ష్మి , బాబు ఆంటోనీ , బ్రహ్మానందం, గుమ్మడి తదితరులు నటించారు. ఇక తెలుగులో బ్రేక్ డ్యాన్స్ లు మొదలైంది ఈ పసివాడి ప్రాణం చిత్రం తోనే. అలాగే ఈ చిత్రంలోని అన్ని పాటలు కుడి బహుళ జనాదరణ పొందాయి. అప్పటి అగ్రశ్రేణి సంగీత దర్శకుడు చక్రవర్తి ఈ చిత్రానికి సంగీతం అందించాడు. కోదండరామిరెడ్డి – చిరంజీవి కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో ఒకటి ఆరా తప్పితే మిగతా చిత్రాలన్నీ రికార్డుల మోత మోగించాయి.

చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, ఏ. కోదండరామి రెడ్డి , అల్లు అరవింద్ , విజయశాంతి, ఫిల్మ్ న్యూస్ , పసివాడి ప్రాణం ,

మునుపటి వ్యాసంసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నటి ప్రగతి వీడియో
తదుపరి ఆర్టికల్పరాన్న జీవి చిత్రం ట్రైలర్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి