పరాన్నజీవి చిత్రంలో నటించడం లేదంటున్న వివాదాస్పద భామ

0
56
TMN logo
TMN logo

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కు వ్యతిరేకంగా రూపొందుతున్న చిత్రం పరాన్న జీవి. ఈ చిత్రంలో వివాదాస్పద భామ శ్రీరెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. అయితే ఇవి మరింతగా ప్రచారం సాగుతుండటంతో ఎట్టకేలకు స్పందించింది శ్రీరెడ్డి. రాంగోపాల్ వర్మ అంటే నాకు లవ్వు అలాంటిది ఆయనకు వ్యతిరేకంగా రూపొందుతున్న సినిమాలో నేను నటించడం ఏంటి ? అది తప్పుడు వార్త అని ఖండించింది శ్రీరెడ్డి. పరాన్న జీవి చిత్రంలో నన్ను నటించాలని కోరారు కానీ వర్మ అంటే ఇష్టం కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా నిర్మించే చిత్రంలో నటించకూడదు అనే నిర్ణయంతో ఆ పాత్రని రిజెక్ట్ చేసాను అని స్పష్టం చేసింది.

శ్రీరెడ్డి ఆ పాత్రని రిజెక్ట్ చేయడంతో ఆ పాత్రలో మరో భామను తీసుకున్నారు. ఈనెల 24 న పరాన్న జీవి చిత్రం శ్రేయాస్ ఈటీ లో ప్రసారం కానుంది. రాంగోపాల్ వర్మ పై కోపంతో అతడి మీద ఈ సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. నిన్న రాత్రి వర్మ పై తిట్ల దండకంతో పాటలను కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఆ పాటలు వింటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వర్మ పవర్ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ మీద సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. దానికి కౌంటర్ ఇస్తూ వర్మపై నాలుగైదు చిత్రాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి