ఒరేయ్ బుజ్జిగా …… ఈరోజే

0
31
orey bujjiga

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఒరేయ్ బుజ్జిగా చిత్రం ఈరోజే ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. అసలు అక్టోబర్ 2 న ఈ సినిమాని ఆహాలో విడుదల చేయాలనీ అనుకున్నారు కానీ రేపు అనుష్క నటించిన నిశ్శబ్దం చిత్రం అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అనుష్క సినిమా తో పోటీ అంటే పెద్ద పొరపాటు చేసినట్లే అందుకే తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు ఒరేయ్ బుజ్జిగా మేకర్స్. అందుకే ఈరోజు సాయంత్రమే ఆహాలో టెలికాస్ట్ చేస్తున్నారు. ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఒరేయ్ బుజ్జిగా లో ఎంటర్ టైన్ మెంట్ కు కూడా పెద్ద పీట వేసారట.

రాజ్ తరుణ్ కు గతకొంత కాలంగా కలిసి రావడం లేదు పాపం. కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలు అందుకున్న ఈ హీరో గత కొన్ని సంవత్సరాలుగా వరుస పరాజయాలతో రేసులో లేకుండాపోయాడు దాంతో ఈ ఒరేయ్ బుజ్జిగా చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉండే కానీ కరోనా వల్ల లాక్ డౌన్ విధించారు కాబట్టి రాజ్ తరుణ్ ఆశలన్నీ అడియాసలే అయ్యాయి.  దాంతో ఇన్నాళ్లు వేచి చూసి ఓటీటీ లో విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కట్ చేస్తే అక్టోబర్ 15 నుండి దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి కాకపోతే 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు ఓపెన్ కానున్నాయి.

విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కెకె రాధామోహన్ నిర్మించగా కేరళ బ్యూటీ మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఇదే చిత్రంలో హీరోయిన్ హెబ్బా పటేల్ కూడా మరొక హీరోయిన్ గా నటించింది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి ఆహాలో ఒరేయ్ బుజ్జిగా స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సినిమా రాజ్ తరుణ్ కు సక్సెస్ ని ఇస్తుందా ? లేదా ? అన్నది ఈరోజు సాయంత్రమే తేలనుంది.

మునుపటి వ్యాసంప్రగ్యా జైస్వాల్ న్యూ ఫొటోస్
తదుపరి ఆర్టికల్మరో చరిత్ర సృష్టించిన విజయ్ దేవరకొండ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి