మరో నటుడి ఎంగేజ్ మెంట్

0
52
raja fidha movie

 

ఫిదా చిత్రంలో వరుణ్ తేజ్ అన్నయ్యగా నటించిన నటుడు రాజా చెంబోలు ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు ఈ రాజా చెంబోలు. తెలుగులో పలు చిత్రాల్లో సహాయ నటుడిగా నటించాడు. అయితే నిన్నటి రోజున వివాహ నిశ్చితార్థం జరిగినట్లు చెప్పుకొచ్చాడు కానీ అమ్మాయి ఎవరు ? తదితర విషయాలు మాత్రం వెల్లడించలేదు. అయితే తనకు కాబోయే శ్రీమతితో కలిసి దిగిన ఫోటో ని మాత్రం సోషల్ మీడియాలో వెల్లడించాడు రాజా చెంబోలు.

అసలే కరోనా అంటే శుభకార్యాల్లో టాలీవుడ్ ప్రముఖులు ఎక్కడా తగ్గడమే లేదు. వరుసపెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే నితిన్ , నిఖిల్ , కమెడియన్  మహేష్ , దిల్ రాజు , రానా లు పెళ్లిళ్లు చేసుకోగా నిహారిక వివాహ నిశ్చితార్థం జరిగింది .  ఇక ఇప్పుడేమో సిరివెన్నెల సీతారామ శాస్త్రి తనయుడు రాజా వివాహ నిశ్చితార్థం జరిగింది. వివాహ నిశ్చితార్థం జరగడంతో కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ ఊహాలోకాల్లో తేలిపోతున్నాడు రాజా చెంబోలు. ఫిదా చిత్రంతో పాటుగా ఎవడు, నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా , హ్యాపీ వెడ్డింగ్ , అంతరిక్షం , రణరంగం , మిస్టర్ మజ్ను తదితర చిత్రాల్లో నటించాడు రాజా.

మునుపటి వ్యాసంమంగోలియాలో డబ్ అవుతున్న బాహుబలి
తదుపరి ఆర్టికల్సంచలనం సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ కామన్ డీపీ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి