మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్

0
51

సోనూ సూద్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు చిన్నారుల బాధ్యత నాది వాళ్ళు అనాధలు కాదు అంటూ ట్వీట్ చేసాడు. తెలంగాణ రాష్ట్రం లోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలంలోని గట్టు సత్తయ్య – అనురాధ దంపతులకుక ముగ్గురు పిల్లలు. మనోహర్( 10) , లాస్య (7) , యశ్వంత్ (4) అయితే కొంతకాలం క్రితం సత్తయ్య మరణించాడు. ఆ బాధలో ఉన్న అనురాధ కూడా నాలుగు రోజుల క్రితం మరణించింది. దాంతో ఆమె ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. అనురాధ మరణించిన తర్వాత ఆమె కరోనాతో మరణించి ఉండొచ్చని భయపడి చుట్టుపక్కల వాళ్ళు చూడటానికి కూడా భయపడ్డారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ విషయం సోనూ సూద్ కు తెలియడంతో అనాధలైన ముగ్గురు పిల్లల నేను చూసుకుంటానని స్పష్టం చేసారు సోనూ సూద్. దాంతో సోనూ సూద్ ని మనిషి రూపంలో ఉన్న దేవుడిగా కీర్తిస్తున్నారు జనాలు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు సోనూ సూద్ . లాక్ డౌన్ సమయం నుండి సోనూ సూద్ ఒక్కసారిగా సూపర్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ ఆపద సంభవించినా వినిపిస్తున్న పేరు ఒక్కటే సోనూ సూద్. తెరమీద విలన్ కానీ భారతదేశానికి అసలు సిసలైన హీరోగా అవతరించాడు. సోనూ సూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని కోరుతున్నారు పలువురు ప్రముఖులు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి