ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ల చిత్ర కథ నేపథ్యం

0
37
tarak kgf director movie

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా నేపథ్యం ఆసక్తికరంగా మారింది. ఇండియా – పాకిస్థాన్ ల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ఒకప్పుడు ఇండియాలో భాగంగానే ఉందనే విషయం తెలిసిందే. అయితే మతపరమైన అంశం పైకి లేచి పాకిస్థాన్ దేశంగా ఏర్పడింది. పాకిస్థాన్ దేశంగా ఏర్పడిన తర్వాత అక్కడి హిందువుల పరిస్థితి ఎలా తయారయ్యింది అలాగే ఇండో – పాక్ యుద్ధ సమయంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి అన్న కథాంశంతో ఈ యుద్ధం చిత్రం రూపొందనుందట.


ఇక ఎన్టీఆర్ పాత్ర నందమూరి అభిమానులకు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉండనుందట అందుకే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని హై ఓల్టేజ్ ట్రాన్సఫామ్ తో పోల్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ అద్భుత పాత్ర ప్రేక్షకులను థ్రిల్ అయ్యేలా చేస్తుందట. ఇక ఇండో – పాక్ యుద్ధ సన్నివేశాలు కూడా హైలెట్ గా నిలవనున్నాయట. ఇక ఈ చిత్రం 2021 ఎండింగ్ లో లేదంటే 2022 లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కూడా పాన్ ఇండియా చిత్రంగా తీయనున్నారు. కెజిఎఫ్ చిత్రంతో ప్రశాంత్ నీల్ రేంజ్ పెరిగింది. ఇక ఎన్టీఆర్ తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్నాడు కాబట్టి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్ర కథాంశం కూడా పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది కాబట్టి 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారట. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ వల్ల ఎన్టీఆర్ అభిమానులు మరింత సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఎన్టీఆర్ అంటే మాస్ హీరో అలాంటి మాస్ హీరోని మాస్ దర్శకుడు మరింత ఊర మాస్ గా చూపించడం ఖాయమని అద్భుతమైన యాక్షన్ లతో అలరించడం ఖాయమని భావిస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి