తీవ్ర దుఃఖసాగరంలో ఎన్టీఆర్

0
59
hari krishna 's death anniversary

తీవ్ర దుఃఖసాగరంలో ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర దుఃఖసాగరంలో మునిగాడు. ఈరోజు నందమూరి హరికృష్ణ మరణించిన రోజు దాంతో తండ్రి జ్ఞాపకాలను నెమరువేసుకుంటు కన్నీళ్ల పర్యంతం అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. 2018 ఆగస్ట్ 29 న నార్కట్ పల్లి పరిసర ప్రాంతంలో నందమూరి హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురై చనిపోయిన విషయం తెలిసిందే. నెల్లూరులో తన అభిమాని కుటుంబంలో జరుగుతున్న పెళ్లికి హాజరు కావడానికి 2018 ఆగస్ట్ 29 న ఉదయం టాటా సఫారీ వాహనంలో బయలుదేరారు హరికృష్ణ. అయితే వేగంగా వెళుతున్న సమయంలో మంచి నీళ్ళు తాగడానికి బాటిల్ తీసుకొని తాగుతున్న సమయంలో కారు అదుపుతప్పింది. దాంతో డివైడర్ ని ఢీకొట్టి అవతలి వైపున ఎగిరిపడింది. ఆ యాక్సిడెంట్ లో నందమూరి హరికృష్ణ అక్కడికక్కడే చనిపోయాడు.

అంతకుముందు కూడా దాదాపు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఎన్టీఆర్ పెద్దన్న నందమూరి జానకిరామ్ కూడా ఇదే విధంగా కారు యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ల కుటుంబాల్లో కారు యాక్సిడెంట్ సంఘటనలు తీవ్రంగా కలిచివేశాయి. తమకు ప్రియమైన ఇద్దరు కూడా రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడంతో ఎన్టీఆర్ కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది.

ఈరోజు హరికృష్ణ ద్వితీయ వర్ధంతి కావడంతో తండ్రిని తలుచుకుంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యారు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు. హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించిన మహా ప్రస్థానంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వెళ్లి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అప్పటి సంఘటనలు తలుచుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. రోడ్ యాక్సిడెంట్ ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది అందుకే ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ నటించిన ప్రతీ చిత్రంలో ఈ రోడ్ యాక్సిడెంట్ కి సంబంధించిన విషయాన్ని తన అభిమానులకు, ప్రేక్షకులకు చెబుతూ అప్రమత్తం చేస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి