ఎన్టీఆర్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం

0
32
student no 1movie time image

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం ” స్టూడెంట్ నెం 1”. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకుడిగా పరిచయం అయిన చిత్రం ఈ స్టూడెంట్ నెం 1. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ కు మంచి ప్రారంభాన్నిచ్చింది. ఎన్టీఆర్ బాల నటుడిగా రామాయణం , బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాల్లో నటించినప్పటికీ హీరోగా నటించిన చిత్రం మాత్రం ”నిన్ను చూడాలని ” . అయితే ఆ సినిమా ప్లాప్ అయ్యింది దానికి తోడు ఎన్టీఆర్ ఆకారం , డైలాగ్ డెలివరీ చూసి జనాలు నవ్వుకున్నారు.

ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ రాఘవేంద్రరావు ఎన్టీఆర్ ని హీరోగా నిలబెట్టడానికి ఎస్ ఎస్ రాజమౌళిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం ఈ స్టూడెంట్ నెం 1. ఎన్టీఆర్ సరసన గజాల నటించగా కీలక పాత్రలో రాజీవ్ కనకాల నటించాడు. 2001 సెప్టెంబర్ 27 న విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ కు అలాగే ఎస్ ఎస్ రాజమౌళికి మొట్టమొదటి కమర్షియల్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. అసలు తన మొదటి సినిమాకు లావుగా ఉన్న ఎన్టీఆర్ హీరో ఏంటి ? అని షాక్ అయ్యాడట రాజమౌళి. అయితే రెండు షెడ్యూళ్లు అయ్యాక ఎన్టీఆర్ – రాజమౌళి మంచి ఫ్రెండ్స్ అయ్యారు దాంతో అప్పటి నుండి ఎన్టీఆర్ రాజమౌళిని ” జక్కన్నా ” అని పిలుస్తున్నాడు దాంతో రాజమౌళికి మరో పేరు జక్కన్న గా మారిపోయింది.

ఒక కోటి 80 లక్షలతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లోనే 12 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దాంతో ఎన్టీఆర్ రేంజ్ మారిపోయింది. ఇక ఆది సినిమాతో ఊహించని స్టార్ డం వచ్చింది. స్టూడెంట్ నెం 1 చిత్రం విడుదలై సరిగ్గా 19 సంవత్సరాలు దాంతో అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు స్టూడెంట్ నెం 1 చిత్ర బృందం. ఈ చిత్ర విజయంలో ఎం ఎం కీరవాణి అందించిన పాటలు కీలక పాత్ర పోషించాయి. 

మునుపటి వ్యాసంపాయల్ ఘోష్ ఫొటోస్
తదుపరి ఆర్టికల్సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ కెరీర్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి