హీరోగా పరిచయం కానున్న ఎన్టీఆర్ బావమరిది

0
74
ntr jr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ హీరోగా పరిచయం కానున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం నితిన్ కథలు వింటున్నాడట. తనకి బాగా నచ్చిన కథని , ప్రేక్షకులకు నచ్చే కథని ఎంపిక చేసుకున్నాక అప్పుడు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బావమరిది అంటే తన భార్యకు స్వయానా సోదరుడు అన్నమాట. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి అన్న విషయం తెలిసిందే. నార్నే శ్రీనివాసరావు కూతురు లక్ష్మీ ప్రణతి. ఇక ఆ నార్నే శ్రీనివాసరావు తనయుడే ఈ నితిన్. ఎన్టీఆర్ బావమరిది కావడం వల్ల సినిమా రంగం పట్ల మరింత మక్కువ పెరిగిందట. చిన్నప్పటి నుండే సినిమాలంటే బాగా ఆసక్తి నితిన్ కు. దానికి తోడు బావ నటించిన సినిమాలు చూస్తూ తనకు కూడా నటన పట్ల ఆసక్తి కలిగిందట.

హీరోగా తనని తాను నిరూపించుకోవాలంటే నటనతో పాటుగా యాక్షన్ సీన్స్ లో అలాగే డ్యాన్స్ లలో కూడా సత్తా చాటాలి కాబట్టి తగిన శిక్షణ తీసుకుంటున్నాడట. అలాగే మరోవైపు కథలను కూడా వింటున్నాడట. ఈ విషయం ఎన్టీఆర్ దృష్టికి కూడా వచ్చిందట. కరోనా కాలం కాబట్టి అందరికి కూడా కావలసినంత ఖాళీ సమయం దొరికింది దాంతో తన కోరికని బయట పెట్టాడట. ఇక నార్నే శ్రీనివాసరావు తన కొడుకు అభీష్టం మేరకు ప్రొడక్షన్ హౌజ్ కూడా స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ విషయానికి వస్తే……టాలీవుడ్ లో ఎక్కువగా వారసులు రాణిస్తున్నారు. నందమూరి, అక్కినేని , కృష్ణ , కృష్ణంరాజు కుటుంబాల వారసులతో పాటుగా ఇప్పుడు మెగా కుటుంబం కూడా తొడయ్యింది. టాలీవుడ్ మొత్తం వారసులతో నిండిపోయింది. అయితే వారసులకు ఎంట్రీ ఈజీ గానే లభిస్తుంది కానీ సక్సెస్ మాత్రం వాళ్ళ కష్టం మీద అలాగే అదృష్టం మీద మాత్రమే ఆధారపడి ఉంది. స్టార్ లుగా ఎదుగుతున్న వారసులు ఉన్నారు అలాగే వారసత్వంతో వచ్చి విఫలమైన వాళ్ళు కూడా ఉన్నారు ఈ టాలీవుడ్ లో. మరి ఈ రెండు జాబితాలలో ఏ జాబితాలో చేరతాడో ఎన్టీఆర్ బావమరిది నితిన్.

మునుపటి వ్యాసం ప్రభాస్ సినిమాలో నివేదా థామస్ ?
తదుపరి ఆర్టికల్అదిరిపోయే రేంజ్ లో ప్రభాస్ కొత్త చిత్రం
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి