ఎన్టీఆర్ మళ్ళీ ఆ ఇద్దరు డైరెక్టర్ లతో

0
52
jr ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్ళీ ఇద్దరు స్టార్ డైరెక్టర్ లతో తదుపరి సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. అంతేకాదు నాకు తగ్గ కథ సెట్ చేసుకోండి అని ఆ దర్శకులను కోరాడట. ఇంతకీ ఎన్టీఆర్ మళ్ళీ పని చేయాలనీ అనుకుంటున్న ఆ ఇద్దరు దర్శకులు ఎవరో తెలుసా …….. కొరటాల శివ , సుకుమార్. కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చిత్రంలో నటించాడు ఎన్టీఆర్. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో మళ్ళీ కొరటాలతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట ఎన్టీఆర్.

ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే ఖచ్చితంగా విభిన్న కథా చిత్రమనే చెప్పాలి. రివేంజ్ డ్రామా అయినప్పటికీ ఎన్టీఆర్ కున్న మాస్ ఇమేజ్ కి భిన్నంగా నాన్నకు ప్రేమతో చిత్రాన్ని రూపొందించాడు సుకుమార్. రివేంజ్ డ్రామా ని విభిన్నంగా రూపొందడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా కొత్తగా ఫీలయ్యారు. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది దాంతో ఎన్టీఆర్ కూడా మళ్ళీ సుకుమార్ దర్శకత్వంలో మరో విభిన్న కథా చిత్రం చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడట.

ఎన్టీఆర్ తాజాగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కంప్లీట్ అయ్యాక త్రివిక్రమ్ దర్శకత్వంలో అయిననూ పోయిరావలె హస్తినకు అనే రాజకీయ వ్యంగ్య చిత్రం చేయనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా చేయనున్నాడు. అందుకే వాటి తర్వాత కొరటాల లేదా సుకుమార్ లలో ఎవరో ఒకరు ముందుగా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటే వాళ్లతో సినిమా చేయాలనీ ముందు జాగ్రత్త తీసుకుంటున్నాడట. మొత్తానికి ఎన్టీఆర్ ప్లాన్ బాగానే ఉంది. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి