హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు

0
43
rakul preeth recived notices from ncb

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్టాలీవుడ్ లో మరోసారి కలకలం చెలరేగింది. డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు ఇచ్చారు ఎన్సీబీ అధికారులు. రకుల్ ప్రీత్ సింగ్ తో పాటుగా బాలీవుడ్ హీరోయిన్ లు దీపికా పదుకోన్ , సారా అలీఖాన్ , శ్రద్దా కపూర్ లకు కూడా నోటీసులు ఇచ్చారు. రకుల్ ప్రీత్ సింగ్ ని ఈరోజున విచారణకు హాజరు కావాలని ఆదేశించగా ఇదే రోజున సారా అలీఖాన్ , శ్రద్దా కపూర్ లను కూడా విచారణకు రమ్మని ఆదేశాలు జారీ చేసారు. ఇక సెప్టెంబర్ 25 న దీపికా పదుకోన్ ని విచారణకు రావాలని నోటీసులు అందించారు.

అయితే రకుల్ ప్రీత్ సింగ్ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది రకుల్. ఎన్సీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు కాబట్టి విచారణకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. రకుల్ తో పాటుగా శ్రద్దా కపూర్ , సారా అలీఖాన్ , దీపికా పదుకోన్ లు కూడా హాజరు కానున్నారు. ఇక విచారణలో ఎలాంటి విషయాలు వెల్లడి కానున్నాయో చూడాలి.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు పలు మలుపులు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని తలపిస్తోంది. ఆత్మహత్య కేసు ఇలా డ్రగ్స్ వైపు టర్న్ అయ్యింది. హీరోయిన్ రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేయడంతో పలువురు హీరోయిన్ ల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఇక అప్పుడే రకుల్ ప్రీత్ సింగ్ పేరు వెల్లడి అయ్యింది కానీ నాకు ఈ కేసుతో సంబంధం లేదని గట్టిగానే చెప్పింది రకుల్ అయితే ఎన్సీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు కాబట్టి కొంతవరకు ఆందోళన వ్యక్తం అవ్వడం ఖాయం. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి