దృశ్యం దర్శకుడు కన్నుమూత

0
47
directore nishikanth

దృశ్యం దర్శకుడు నిషికాంత్ కామత్ అనారోగ్యంతో కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిషికాంత్ కామత్ ఆరోగ్యం విషమించడంతో నిన్న సాయంత్రం కన్నుమూశాడు. అయితే నిషికాంత్ చనిపోయాడని కొద్దిసేపు లేదు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని కొద్దిసేపు నానా హంగామా నడిచింది. కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలు నిషికాంత్ మరణించాడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ లు పెట్టారు . ఆ తర్వాత చనిపోలేదు అని తెలియడంతో వెంటనే వాటిని డిలీట్ చేసారు. అయితే ఆసుపత్రి వర్గాలు కాస్త ఆలస్యంగా ప్రకటించినప్పటికీ చనిపోయింది మాత్రం నిన్న సాయంత్రమే అని స్పష్టం చేసారు.

మలయాళంలో మోహన్ లాల్  సంచలన విజయం సాధించిన దృశ్యం చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేసారు. తెలుగులో కూడా సూపర్ హిట్ కావడంతో తమిళ్ లో కమల్ హాసన్ హీరోగా రీమేక్ చేసారు తమిళ్ లో కూడా పెద్ద హిట్ అయ్యింది దృశ్యం దాంతో హిందీలో అజయ్ దేవ్ గన్ , టబు లతో దృశ్యం చిత్రాన్ని రీమేక్ చేసారు నిషికాంత్ కామత్. హిందీలో కూడా సూపర్ హిట్ అయ్యింది దృశ్యం దాంతో నిషికాంత్ కామత్ కు మంచి పేరు వచ్చింది.

అయితే చాలాకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న నిషికాంత్ ఆరోగ్యం విషమించడంతో జులై 31 న హైదరాబాద్ లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజిలో చేరాడు చికిత్స కోసం. అప్పటి నుండి 18 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే మరణించాడు. నిషికాంత్ కామత్ మరణం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. కామత్ మరణంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

మునుపటి వ్యాసంఅదిరిపోయే రేంజ్ లో ప్రభాస్ కొత్త చిత్రం
తదుపరి ఆర్టికల్తమ్ముడి కోసం నిర్మాతగా మారుతున్న విజయ్ దేవరకొండ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి