ఎన్టీఆర్ వచ్చినా టీడీపీని కాపాడలేడంటున్న మంత్రి

0
51
tdp party

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడు అయినా కూడా తెలుగుదేశం పార్టీ బ్రతికి బట్ట కట్టడం కష్టమని , తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని కుండబద్దలు కొట్టాడు ఆంధ్రప్రదేశ్ కి చెందిన మంత్రి నాని. మొదట తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు నాని , గుడివాడ నుండి పోటీ చేసి గెలిచాడు కూడా. అయితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గుడివాడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నాడు. అయితే నందమూరి హరికృష్ణ అయినా జూనియర్ ఎన్టీఆర్ అయినా నాని కి చాలా చాలా ఇష్టం. వాళ్లపై ఎలాంటి విమర్శలు చేయడు కానీ చంద్రబాబు పై మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తాడు.

ఇక తెలుగుదేశం పార్టీ పని ఆయిపోయిందని , చచ్చిన పాముతో సమానమని , ఇప్పుడున్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా రంగంలోకి దిగినా , ప్రచార బాధ్యతలు చేపట్టినా ప్రయోజనం లేదని తేల్చి చెప్పాడు నాని. ఎన్టీఆర్ కు అమోఘమైన ఇమేజ్ ఉంది కాని చచ్చిన పార్టీని బ్రతికించే శక్తి మాత్రం లేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఏపీలోనే కాదు తెలంగాణ లో కూడా తెలుగుదేశం పార్టీ ముగిసిన అధ్యాయమని ఏపీలో జగన్ కు ఎదురు లేదని , మరో 40 ఏళ్ల వరకు కూడా జగన్ ముఖ్యమంత్రి గా కొనసాగుతాడని ధీమా వ్యక్తం చేస్తున్నాడు నాని.

మునుపటి వ్యాసంమహేష్ రిజెక్ట్ చేసిన ఆ 3 చిత్రాలు కూడా హిట్టే
తదుపరి ఆర్టికల్పుకార్లు ఖండించిన రాంగోపాల్ వర్మ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి