ప్రభాస్ సినిమాలో నివేదా థామస్ ?

0
55
nivedhata thamas

యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్ తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. అగ్ర నిర్మాత అశ్వనీదత్ సుమారుగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకోన్ ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీపికా పదుకోన్ కోసం ఏకంగా 30 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో నటించడానికి దీపికా డిమాండ్ చేయడంతో ఆ మొత్తం ఇవ్వడానికి అంగీకరించారు. ఇక ప్రభాస్ కూడా భారీ మొత్తమే తీసుకుంటున్నాడు. ప్రభాస్ ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట ఈ సినిమా కోసం.

ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో మలయాళ భామ నివేదా థామస్ ని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో నివేదా థామస్ పాత్ర కీలకంగా ఉంటుందట. అందుకే ఇలాంటి పాత్రలో నివేదా థామస్ అయితే బాగుంటుందని ఆమెని సంప్రదించారట దర్శకుడు నాగ్ అశ్విన్. కథలో మలుపు తిప్పే క్యారెక్టర్ కావడంతో నివేదా తప్పకుండా ఒప్పుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు దర్శకుడు నాగ్ అశ్విన్.

ప్రభాస్ తాజాగా రాధే శ్యామ్ చిత్రంలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. కరోనా వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయింది. కరోనా తగ్గిన తర్వాత మళ్ళీ షూటింగ్ ప్రారంభం కానుంది. బ్యాలెన్స్ గా ఉన్న పార్ట్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది 2021 లో విడుదల చేయనున్నారు. 

మునుపటి వ్యాసంఆ హీరో హీరోయిన్  ప్రేమలో ఉన్నారా ?
తదుపరి ఆర్టికల్హీరోగా పరిచయం కానున్న ఎన్టీఆర్ బావమరిది
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి