తమన్నా డిమాండ్ కు తలొగ్గిన నితిన్  

0
38
tamanna n

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్మిల్కీ బ్యూటీ తమన్నా అందా ధూన్ రీమేక్ చిత్రంలో నటించడానికి ఒప్పుకొని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. టబు పోషించిన పాత్రని పోషించడానికి తమన్నా ఒప్పుకోవడం సంచలనంగా మారింది. అయితే తమన్నా ఈ పాత్రలో నటించడానికి రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందో తెలుసా …….. కోటిన్నర. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా తమన్నా కోటిన్నర రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట ఈ పాత్ర చేయడానికి. ఇంకేముంది ఆ మొత్తాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నారు నితిన్ అండ్ కో. తమన్నా డిమాండ్ కు తలొగ్గి అంత మొత్తం ఇస్తామని చెప్పడంతో అంగీకరించింది.

తమన్నా ఇంత మొత్తం తీసుకోవడం ఒక షాకింగ్ న్యూస్ అయితే ఇలాంటి హాట్ పాత్ర పోషించడం మరింత వైరల్ గా మారింది టాలీవుడ్ లో. హిందీలో టబు శృంగారం కోసం పరితపించే పాత్రలో అద్భుత అభినయాన్ని ప్రదర్శించింది దాంతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది . టబు మల్టీ టాలెంటెడ్ అందుకే ఛాలెంజింగ్ పాత్రలను చేస్తూ ఉంటుంది కానీ తమన్నా అలా కాదు హీరోయిన్ గా నటిస్తోంది ఇంకా. ఇలాంటి సమయంలో చాలా హాట్ గా నటించడం అంటే తప్పకుండా తన కెరీర్ పై ప్రభావం చూపుతుంది.

ఈ విషయం తెలిసినప్పటికీ తమన్నా మాత్రం వెనుకడుగు వేయలేదు. శృంగారం కోసం తపించిపోయే స్త్రీ గా నటించడానికి ఒప్పుకుంది. ఇక ఇలా నటించడానికి కోటిన్నర డిమాండ్ చేయడం అందుకు నితిన్ ఒప్పుకోవడంతో ఇక ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయం. నితిన్ సరసన నభా నటేష్ నటిస్తుండగా తమన్నా కీలక పాత్రలో నటించనుంది. తమన్నా చేతిలో సరైన సినిమాలు లేవు అందుకే ఇలా క్యాష్ చేసుకోవడానికి ఈ పాత్ర ఒప్పుకుందనే గుసగుసలు మొదలయ్యాయి ఫిలిం నగర్ లో. ఇక ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. 

 

 

మునుపటి వ్యాసంయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం లెజెండరీ డైరెక్టర్
తదుపరి ఆర్టికల్విజయ్ దేవరకొండ తదుపరి సినిమా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి