ఖరీదైన కారుని గిఫ్ట్ గా ఇచ్చిన నితిన్

0
37
bheeshma movie hero nithin given gift to venky kudumula

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్-  భీష్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తనకు ఇచ్చినందుకు గాను దర్శకుడు వెంకీ కుడుములకు ఖరీదైన రేంజ్ రోవర్ కారుని బహుమతిగా ఇచ్చాడు హీరో నితిన్. దాంతో సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు వెంకీ కుడుముల. హీరో నితిన్ ఇచ్చిన కారుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కృతఙ్ఞతలు తెలియజేసాడు వెంకీ కుడుముల. ఛలో చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు వెంకీ కుడుముల. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత నితిన్ హీరోగా భీష్మ అనే చిత్రాన్ని చేసాడు.

నితిన్ గత నాలుగేళ్లుగా సరైన సక్సెస్ లేక బాధపడుతున్నాడు సరిగ్గా అలాంటి సమయంలోనే వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ అనే చిత్రం చేసాడు. నాలుగేళ్ళ తర్వాత భీష్మ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు నితిన్ . సరిగ్గా కరోనా ముందు ఈ సినిమా విడుదల అయ్యింది , ఇంకా పెద్ద హిట్ అయ్యేది కానీ కరోనా వల్ల కాస్త కలెక్షన్లు తగ్గాయి లేదంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది భీష్మ. మొత్తానికి సూపర్ హిట్ కావడంతో చాలా సంతోషంగా ఉన్న నితిన్ రేంజ్ రోవర్ కారుని బహుమతిగా ఇచ్చాడు.

నితిన్ తాజాగా రంగ్ దే చిత్రాన్ని చేస్తున్నాడు . కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత రంగ్ దే చిత్రం షూటింగ్ జరుగనుంది. ఇక వెంకీ కుడుముల విషయానికి వస్తే …….. రాంచరణ్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని చేసే ఆలోచనలో ఉన్నాడు. ఆల్రెడీ చరణ్ కు కథ చెప్పడం అతడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయితే ఆర్ ఆర్ ఆర్ అయ్యాకే ఈ సినిమా పట్టాలెక్కనుంది. అంటే 2021 సెకండాఫ్ లోనే అన్నమాట. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి