విజయ్ దేవరకొండని విమర్శిస్తున్న నెటిజన్లు

0
32
Nitigans criticizing Vijay Deverakonda

క్రేజీ హీరో విజయ్ దేవరకొండని విమర్శిస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ ని విమర్శించడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? తాజాగా హీరో ఫైటర్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ భామ అనన్య పాండే నటిస్తోంది. అయితే సినిమా షూటింగ్ సందర్బంగా అనన్య పాండే నడుము చుట్టూ తన చేతులు వేసి నడుము దగ్గర తన తల పెడతాడు విజయ్ దేవరకొండ.

అయితే అది ఎలాంటి సీన్ అన్నదో బయటి జనాలకు తెలియదు కాబట్టి హీరోయిన్ నడుముపై చేయి వేసి ఉన్న విజయ్ దేవరకొండ ని అదేపనిగా విమర్శస్తున్నారు నెటిజన్లు. పైగా స్టిల్ లో అనన్య పాండే షార్ట్ మీద ఉంది దాంతో ఇంకా ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా ఫైటర్ చిత్రం రూపొందుతోంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది దాంతో విజయ్ దేవరకొండ ఫైటర్ పై చాలా ఆశలే పెట్టుకున్నాడు.

Image result for vijay devarakonda ananya pandey

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి