నితిన్ ని ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్

0
71

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమాని నితిన్ పెళ్లి కొడుకు కావడంతో అతడ్ని ఆశీర్వదించడానికి వెళ్ళాడు. నిన్న నితిన్ ని పెళ్లి కొడుకుని చేశారు. రేపు రాత్రి 8 గంటకు 30 నిమిషాలకు నితిన్ – షాలిని ల పెళ్లి జరుగనుంది దాంతో నిన్న పెళ్లి కార్యక్రమాలలో భాగంగా పెళ్లి కొడుకు ని చేశారు. ఇక పెళ్లికి వెళ్లడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ముందుగా వెళ్లి నితిన్ ని ఆశీర్వదించాడు పవన్ కళ్యాణ్. తన అభిమాన హీరో తనని ఆశీర్వదించడానికి రావడంతో పరవశించిపోయాడు నితిన్. పవన్ కళ్యాణ్ వెంట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత చినబాబు తదితరులు ఉన్నారు.

నితిన్ – షాలిని ల వివాహం జులై 26 న జరుగనున్న విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ గెటప్ చూసి షాక్ అవుతున్నారు జనాలు. బాగా గుబురుగా పెంచిన గడ్డంతో పాటుగా బాగా పెరిగిన జుట్టుతో పవన్ కళ్యాణ్ ఒక బాబా గా కనిపిస్తున్నాడు. పవన్ గెటప్ చూసి కొంతమంది ఉత్సాహం ప్రదర్శిస్తుంటే మరికొంతమంది మాత్రం పెదవి విరుస్తున్నారు. ఇక పెళ్లి కొడుకు నితిన్ గెటప్ అదిరిపోయే రేంజ్ లో ఉంది.  పెళ్లి అవుతుందన్న సంతోషంలో మరింత అందంగా ఉన్నాడు నితిన్.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి