కరోనాపై పాటరాసి దానికే బలైన నిస్సార్

0
33

కరోనా కరోనా నీతో యుద్ధం చేస్తాం మా భారత భూభాగనా ….. కరోనా కరోనా నిన్ను మట్టి కరిపిస్తాం 130 కోట్ల జనం సరేనా అంటూ పాట రాసాడు కవి , గాయకుడు నిస్సార్. ఆ పాటని ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ఆలపించారు. నిస్సార్ రాసిన పాట వందేమాతరం నోట రావడంతో ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ పాట మార్చి నెలాఖరున వచ్చింది. కట్ చేస్తే ఆ కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు నిస్సార్. దాంతో నిస్సార్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

తెలంగాణ ఆర్టీసీ లో పనిచేస్తున్న నిస్సార్ కవి , గాయకుడు కూడా. కరోనా మహమ్మారి పై యుద్ధం ప్రకటిస్తూ పాట రాసిన నిస్సార్ అదే కరోనా సోకి సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం పలు హృదయాలను కలిచివేసింది. కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న నిస్సార్ ఈరోజు ఉదయం గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. నిస్సార్ మృతికి పలువురు రాజకీయ నాయకులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. అలాగే సాహిత్యవేత్తలు సైతం నిస్సార్ కు అశ్రునివాలి అర్పించారు.  

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి