నిశ్శబ్దం రివ్యూ

0
202
nishabdham movie review


నటీనటులు : అనుష్క , మాధవన్ , షాలిని పాండే , అంజలి
సంగీతం : గోపీసుందర్ – గిరీష్
నిర్మాతలు : విశ్వప్రసాద్ – కోన వెంకట్
దర్శకత్వం : హేమంత్ మధుకర్
విడుదల : 2020 అక్టోబర్ 2, అమెజాన్ ప్రైమ్
రేటింగ్ : 3/5

స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ” నిశ్శబ్దం ”. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో విశ్వప్రసాద్ – కోనవెంకట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ఈరోజు స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వల్ల ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది. మరి ఈరోజు నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది చూద్దామా ?

కథ :

సాక్షి ( అనుష్క ) తండ్రి అనాథ శరణాలయం నెలకొల్పుతాడు అందులోనే పెరిగిన సోనాలి ( షాలిని పాండే ) సాక్షి కి మంచి స్నేహితురాలు అవుతుంది.  సోనాలీ  సాక్షి ని విడిచి ఉండలేదు అలాంటిది ఈ ఇద్దరి మధ్యలోకి సాక్షి జీవితంలోకి ఆంటోనీ ( మాధవన్ ) వస్తాడు. ఆంటోనీ రాకతో సాక్షి అతడితో కలిసి ఉండటం సోనాలి తట్టుకోలేకపోతుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సోనాలి మిస్ అవుతుంది కట్ చేస్తే ఆంటోనిని అత్యంత దారుణంగా హత్య చేస్తారు. అసలు సోనాలి ఎందుకు మిస్ అయ్యింది ? ఆంటోనిని హత్య చేసింది ఎవరు ? అన్న పరిశోధన చేయడానికి వస్తుంది మహా ( అంజలి ). అయితే ఈ కేసు చేధించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొలిక్కి రావు ఎందుకంటే సాక్షి నోరు విప్పి చెప్పలేని మూగ యువతి దాంతో ఈ కేసుని ఎలా ఛేదించారు ? అసలు హంతకులు ఎవరు ? ఇదంతా జరగడానికి కారకులు ఎవరు ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హైలెట్స్ :

అనుష్క నటన
సస్పెన్స్ ఎలిమెంట్స్
స్క్రీన్ ప్లే
షాలిని పాండే
విజువల్స్

డ్రా బ్యాక్స్ :

స్లో నెరేషన్
కొన్ని అనవసర సన్నివేశాలు

పెర్ఫార్మెన్స్ :

మూగ , చెవిటి యువతిగా అనుష్క నటన నిశ్శబ్దం చిత్రానికి హైలెట్ గా నిలిచింది. మూగ , చెవిటి యువతిగా నటించడానికి అనుష్క గొప్ప ప్రయత్నమే చేసింది. కొన్ని రోజుల పాటు అలాంటి వాళ్లతో గడిపి తన పాత్రని మరింత బాగా వచ్చేలా చేసింది. తనకున్న డెడికేషన్ ఎలాంటిదో చెప్పకనే చెప్పింది ఈ చిత్రంతో. ఇక మాధవన్ తో అప్పుడెప్పుడో కెరీర్ ప్రారంభంలో కలిసి నటించింది అనుష్క. కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ మాధవన్ తో నటించింది దాంతో ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. షాలిని పాండే పాత్ర కూడా విభిన్నమైనది కావడంతో ఆ పాత్రని బాగానే పోషించి మెప్పించింది. అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ భామకు అంతగా పేరు రాలేదు కానీ ఈ సినిమా ద్వారా తప్పకుండా మళ్ళీ మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. అంజలి , సుబ్బరాజు , హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడిసన్ లు తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం :

ఈ సినిమాకు విజువల్స్ హైలెట్ గా నిలిచాయి. సినిమా మూడ్ ని క్యారీ చేసేలా అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను చిత్ర కథలో లీనమయ్యేలా చేస్తాయి. గిరీష్ అందించిన రీ రికార్డింగ్ కూడా హైలెట్ గా నిలిచింది. ప్రొడక్షన్ వేల్యూస్ చాలా బాగున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా అమెరికాలో అందునా అద్భుతమైన లొకేషన్ లలో షూటింగ్ చేసారు. ఎడిటింగ్ బాగుంది అయితే మరికొన్ని సన్నివేశాలను తొలగిస్తే మరింతగా బాగుండేది. ఇక దర్శకుడు హేమంత్ మధుకర్ విషయానికి వస్తే ……. విభిన్న కథాంశాన్ని ఎంచుకున్నాడు అలాగే స్క్రీన్ ప్లే కూడా బాగా రాసుకున్నారు అయితే కథనం విషయాల్లో మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంకా పెద్ద హిట్ అయ్యుండేది.

ఓవరాల్ గా :

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలు అంతగా లేవు కాబట్టి ఈ నిశ్శబ్దం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం కష్టమే. అయితే విభిన్న కథా చిత్రాలను కోరుకునే ప్రేక్షకులకు మాత్రం తప్పకుండా నచ్చుతుంది. 

మునుపటి వ్యాసంరాహుల్ గాంధీపై పోలీసుల దాడి
తదుపరి ఆర్టికల్జగన్ నిర్ణయంతో షాక్ అయిన రోజా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి